క్యూట్ సీతమ్మవారు!

                                                                                                                                                   (న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దసరా సందర్భంగా ఉత్తర భారతదేశంలో రామలీలా ప్రదర్శనలు విరివిగా కనబడతాయి. శ్రీరామచంద్రుడి జీవితగాధ విశేషాలను వివిధ కళారూపాలలో ప్రదర్శిస్తారు. అలాంటి చోట్ల పిల్లలకు సీతారామలక్ష్మణులుగా వేషం వేసి ఆనందించడం కూడా కనబడుతుంది. అలాంటి ఒక సందర్భంలో సీతమ్మవారి వేషం వేసిన ఓ చిన్ని పాప డోలు చప్పుడుకు డాన్స్ చేయడం చూసేవారికి తెగ నచ్చేసింది.

వీడియోలో ముగ్గురు పిల్లలు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వేషంలో నుంచునిఉంటారు. కొద్దిగా పెద్దవారైన రామలక్ష్మణులు బిడియంగా చూస్తుండగా చిన్నిపాప అయిన సీత మాత్రం డోలు శబ్దాలకు అప్రయత్నంగా డాన్స్ చేయడం మొదలుపెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్వీట్ ఛైల్డ్, పాప ఎంత సంతోషం కలిగించిందీ అని ఒకరంటే, క్యూటెస్ట్ సీతమ్మవారు అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.