(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గాల్లో ఎరిగి పడిన ఓ మొబైల్ ఫోన్ ను అద్భుతంగా క్యాచ్ పట్టాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ కి చెందిన శామ్యూల్ కెంఫ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ లోని పోర్ట్ అవెన్చురా థీమ్ పార్క్ కు విహార యాత్రకి వెళ్లాడు. పార్క్ లో రోలర్ కోస్టర్ ఎక్కారు. ఆ రోలర్ పైకి వెళ్లి కిందకు వస్తుండగా.. ఓ మొబైల్ గాల్లో ఉండటం చూసి.. వెంటనే దానిని పట్టుకున్నాడు. దాదాపు 130 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్న రోలర్లో కూర్చుకుని కూడా సమయ స్ఫూర్తితో అద్భుతంగా దానిని పట్టుకున్నాడు. ఆ మొబైల్ రోలర్ ఎక్కిన మరో వ్యక్తికి చెందిన్నది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియోని దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు.