(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
లిఫ్టు దగ్గర ఇరుక్కున్న కుక్కను ఓ యువకుడు కాపాడిన వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్లోని హౌస్టన్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఓ యువతి తన కుక్కతో లిఫ్టు దగ్గరకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి జానీ మాథిస్ అనే యువకుడు లిఫ్టు లోంచీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆమె లిఫ్టులోకి వెళ్లింది. అయితే, ఆమె వెంట వచ్చిన కుక్క లోపలికి వెళ్లక ముందే లిఫ్టు డోర్ క్లోజ్ అయ్యింది. దీంతో ఆ కుక్క లిఫ్టు బయటే ఉండిపోయింది. అయితే, ఆ కుక్క మెడకు కట్టిన చైన్ లిఫ్టులో ఉండిపోయింది. దీంతో ఆ కుక్క కాసేపు విలవిలాడింది. లిఫ్ట్ డోర్ తిరిగి తెరుచుకోలేదు. లిఫ్టు బయట కుక్క గింజుకోవడం గ్రహించిన జానీ మాథిస్… వెంటనే దానిని రక్షించేందుకు ప్రయత్నించాడు. కుక్క మెడకు కట్టిన చైనును పట్టుకుని లాగేసి దానిని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
!!!! pic.twitter.com/OL5NL0ZBzb
— Johnny Mathis (@Johnnayyeee) December 10, 2019