ఫిట్నెస్ మోడల్ మిచెలీ లెవిన్కు పిగ్ ఐలాండ్లో ఉండే పందులంటే ఇష్టం. వాటితో కలిసి ఫొటోలు తీసుకోవడం కోసం వెనిజులాకు చెందిన ఈ అందాలభామ తరచూ అక్కడికి వెళుతుంటుంది. అయితే ఈ సారి ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురయింది.
పిగ్ ఐలాండ్ బహామా దీవుల సముదాయంలో ఒకటి. బయటి ప్రపంచం నుంచి అక్కడకు తీసుకువెళ్లిన పందుల సంతతి బాగా వృద్ధి చెందడంతో ఆ దీవికి పిగ్ ఐలాండ్ పేరు స్థిరపడి పోయింది.
ముద్దుముద్దుగా ఉండే పంది పిల్లలతో ఆడుకుంటూ ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోలు తీసుకోవచ్చనుకున్న లెవిన్పై ఒక పెద్ద పంది దాడి చేసింది. ఇది నన్ను కరుస్తోంది అంటూ స్పానిష్లో అరుస్తూ కంగారుగా పరిగెట్టిన లెవిన్, తర్వాత మంగళవారం నాడు ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
ఇప్పటికి ఈ వీడియోను 57 లక్షల మంది చూశారు. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. లెవిన్ భర్త జిమ్మీ యుఎస్ఎ టుడేతో మాట్లాడుతూ, తన భార్య ఇక మీదట పిగ్ ఐలాండ్ దాపులకు కూడా వెళ్లదని చెప్పినట్లు ఎన్డిటివి వెబ్సైట్ తెలిపింది.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి.
https://www.instagram.com/p/BtwWkKKhF58/?utm_source=ig_web_copy_link