(న్యూస్ ఆర్బిట్ డెస్క)
దక్షణ ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటం సంభవించింది. పెద్ద ఎత్తున నిప్పులు కక్కింది, లావాను విరజిమ్మింది. కొంతకాలంగా నిద్రాణంగా ఉన్న మౌంట్ ఎట్నా గత గురువారం నుంచీ పొగలు సెగలు కక్కుతోంది.
యూరోప్‌లోని అగ్నిపర్వతాల్లో మౌంట్ ఎట్నా అన్నిటికన్నా పెద్దది. శనివారం నాటికి ఈ అగ్నిపర్వతం కాస్త శాంతించింది. అయితే ఇప్పటికీ ఆ దరిదాపులకు వెళ్లలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
నూతన ఆగ్నేయ బిలంలో ఈశాన్యం వైపున, దక్షిమ ఆగ్నేయం వైపున ఉన్న రెండు పగుళ్ల నుంచి లావా ఎగజిమ్మింది. మొదటిది కిలోమీటరు దూరం, రెండవది రెండు కిలోమీటర్ల దూరం ప్రవహించింది. ఈ విస్ఫోటం వల్ల చుట్టుపక్కల నివాసులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంతకు ముందు మౌంట్ ఎట్నా 2018 డిసెంబర్లో పేలింది.
Video Courtesy: Global News