(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక 65 ఏళ్ల మహిళ కారు వెనక డేంజర్ లైట్ పగిలి ఉంది. పోలీసు ఆపి ఆమెకు 80 డాలర్ల జరిమానా విధించాడు. అంత చిన్నదానికి 80 డాలర్లు కట్టాలా నేను కట్టను పొమ్మంది. కిందకు దిగమంటున్న పోలీసు మాటను ఖాతరు చేయకుండా కారు పోనిచ్చింది. మళ్లీ కారు ఆపిన పోలీసు ఆమెపై స్టన్ గన్ ఉపయోగించాడు. మనిషిని నిరుత్తరుడిగా చేసేందుకు ఈ స్టన్ గన్తో కాలుస్తారు.
అమెరికాలోని ఓక్లహామాలో ఈ సంఘటన జరిగింది. జరిమానా రసీదుపై సంతకం చేయాలని పోలీసు అడిగినపుడు, ఫిక్స్ చేయగలిగిన దానికి నేను 80 డాలర్లు చెల్లించడం అన్యాయం. దానిని నేనే సరిచేస్తాను అని డెబ్రా హామిల్ ఆనే ఆ మహిళ సమాధానమివ్వడం వీడియోలో కనబడుతుంది. పోలీసు వంటిపై అమర్చి ఉండే కెమేరాలో రికార్డయిన వీడియోను విడుదల చేశారు.
కారు ముందుకు దూకించిన హామిల్ను పోలీసు వెంటాడి కారు మళ్లీ ఆపిన తర్వాత ఆమె కిందకు దిగడానికి నిరాకరిస్తుంది. దింపుతున్న పోలీసును ప్రటిఘటిస్తుంది. అప్పుడు అతను అమెపై స్టన్ గన్ ఉపయోగిస్తాడు. పోలీసుపై దాడి చేసిందన్న అభియోగంతో హామిల్పై కేసు పెట్టారు.
వీడియో మీరూ చూడండి: