(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉంటారు. సంచలన సినిమాలను తెరకెక్కించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు… తనలో ఉన్న మరో కోణాన్ని వర్మ బయటపెట్టారు. తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే.. ‘బ్యూటీఫుల్’ అనే చిత్రాన్ని వర్మ శిష్యుడు మంజు తెరకెక్కించాడు. ఊర్మిళ హీరోయిన్ గా వర్మ గతంలో నిర్మించిన ‘రంగీలా’ సినిమాకు ట్రిబ్యూట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జనవరి 1న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం(డిసెంబర్ 23) రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్లో వర్మ సందడి చేశాడు. ఈ వేడుకలో వర్మ .. హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి తనదైన స్టైల్లో స్టెప్పులేశాడు. ప్రస్తుతం వర్మ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.