NewsOrbit
Right Side Videos

రెండు తలల పిల్లి !

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మనుషుల్లో అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ రెండు తలలతో ఉన్న పిల్లి ఎక్కడైనా చూశారా ? కానీ ఓ పిల్లి రెండు తలలతో ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కాలిఫోర్నియాలో పుట్టిన ఈ వింత పిల్లిని వెటర్నరీ డాక్టర్ రాల్ఫ్ ట్రాన్ అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఒక పిల్లి నాలుగు నెలల క్రితం పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక్కటి మాత్రం మిగతావాటి కంటే భిన్నంగా రెండు ముఖాలతో జన్మించింది. దీంతో ఆ పిల్లిని దానితల్లి  దగ్గరికి కూడా రానివ్వలేదు. డాక్టర్‌ దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి ‘డుయో’ అని పేరు కూడా పెట్టాడు. క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే సమస్య వల్ల ఈ పిల్లి ఒకే శరీరం, రెండు తలలతో జన్మించింది. దీనికి రెండు నోర్లు ఉండటం వల్ల ఆహారం తినేందుకు చాలా ఇబ్బంది పడుతోందని డాక్టర్ రాల్ఫ్ ట్రాన్ తెలిపారు. పైగా ఆ రెండు నోళ్లలోకి ఒకేసారి ఆహారాన్ని అందివ్వాల్సి వస్తోందన్నారు. ఈ డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతికింది లేదని, డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ తెలిపారు.

https://www.facebook.com/duotwofacedcat/photos/pcb.130097108402862/130097048402868/?type=3&__tn__=HH-R&eid=ARAvI4qKU6MpWjZc9VGht8NYe6cwf85V8sU2cyuJXF5prcWJxyrbFvKBFVl7RdDRX_R8eEjffiaDymi2&__xts__%5B0%5D=68.ARAMQ5Xl9YM0ECqQ-wud4UyFKuGEj4gY_DSBlthr8Z1lyLdQdNa7bTKiaigS4TGjCwATc8TNATp6M1xBBoopkGuvASNOXkZMrIJTYRL4EV-c0kQf8ksOZ1ypoEi_neILXvaDrPb9qWl820KLgr25VUo4HZCI0EXWZlhzjOYc4q6JacHIvZNnSFmkJPgKk13eY3ENhPJMAvgHCNWHgMiUkz4q55V-bCqzXmUOzrlZIwRvSrtVd3upq1Wou9mKYGvRFZ8DAE_0uGnQ-JwCu7eQ0woNz6e2bL4yZFZ6TQPJyM2TlSvkU_ov0OvES3K5syq5MAcMEnMH8leNIj_A_53KBB8

మొదట్లో డుయో సన్నగా ఉండి, తిండి కూడా తినడానికి ఇబ్బంది పడేదట. ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడినట్టు డాక్టర్ రాల్ఫ్ చెబుతున్నారు. డుయోకు రెండు తలలు, రెండు నోర్లు ఉండటంతో.. రెండు నోళ్ల నుంచి రెండు సార్లు మియావ్ అంటూ పిలుస్తోంది. రాల్ఫ్ డుయో టూ ఫేస్డ్ క్యాట్ అంటూ ఓ ఫేస్‌బుక్ పేజీని సైతం ఓపెన్ చేశారు. నిత్యం డుయోకు సంబంధించిన పోస్ట్‌లను చేస్తున్నారు. డుయో తింటున్న, ఇంకో పిల్లితో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://www.facebook.com/duotwofacedcat/videos/1046369289033745/


Share

Related posts

ఫోని తీవ్రత చూడండి!

Siva Prasad

ఈ పాప చాలా అదృష్టవంతురాలు!

somaraju sharma

వర్మ సినిమా ఇలా కాక ఎలా ఉంటుంది!

Siva Prasad

Leave a Comment