(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొడుకు ‘ఇజ్హాన్’కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇజ్హాన్ పుట్టి ఏడాది అయిన సందర్భంగా తన సోదరితో ఆడుకుంటున్న కుమారుడి వీడియోను సానియా ట్విట్టర్ లో షేర్ చేసింది. వీడియోలో సానియా సోదరి అనం మీర్జా ఒడిలో కూర్చుని ఇజ్హాన్ ఆడుకున్నాడు.
We’ve been looking forward to today for a bit now ? #Izzy ☝? pic.twitter.com/90xU9zBdn5
— Sania Mirza (@MirzaSania) October 30, 2019
గతేడాది అక్టోబర్ 30న సానియా మీర్జాకు మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్- సానియాకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ ఇస్తూ పుట్టిన ఈ పిల్లాడికి ‘ఇజ్హాన్’ అని పేరు పెట్టారు. అరబిక్‌లో ‘దేవుని బహుమతి’, ‘విశ్వమంత ప్రేమ’ అనే అర్థాలు వచ్చేలా కొడుక్కి పేరు పెట్టారు సానియా- షోయబ్ దంపతులు. ఇజ్హాన్ ఫస్ట్ బర్త్ డే సందర్భంగా అతని వీడియోని సానియా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
Happy Birthday my little angel ?? I pray Allah gives you everything you work towards and desire and continue to grow into the most loving and gentle boy that you already are .. InshaAllah .. Thank you for choosing us my little Izhaan ❤️ #HappybirthdayIzhaan pic.twitter.com/Ynj0UbLJZB
— Sania Mirza (@MirzaSania) October 30, 2019