(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మాములుగా పక్షలు ఒకటి రెండు రకాలుగా అరుస్తుంటాయి. కానీ ఓ పక్షి మాత్రం ఎవరూ నేర్పకుండానే 30కిపైగా శబ్దాలు చేస్తోంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ జూలో ఉందీ పక్షి. లైర్ అనే పక్షి రివాల్వర్, మెషిన్ గన్, బస్, కారు అలారం, యుద్ధ ట్యాంకర్, టీవీ పాడైపోయినట్టుగా శబ్దాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. అడిలైడ్ జూలో రకరకాలుగా అరుస్తున్న లైర్ బర్డ్ ని చూసిన ఓ వ్యక్తి వెంటనే వీడియో తీసి… ఫేస్ బుక్లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని కేతన్ జోషి అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి 5వేల మందికి పైగా లైక్స్, 2వేల మందికిపైగా కామెంట్లు కూడా చేశారు. ఈ పక్షి అరుపులు విని ఆనందపడుతున్నారు నెటిజన్లు.
This Lyrebird video via @abcadelaide starts off pretty amazing and gets extremely intense in the third act https://t.co/IVQEE3PBS2 pic.twitter.com/D0LFt8Efvn
— Ketan Joshi (@KetanJ0) October 4, 2019
ఒక్కోజాతి పక్షులు ఒక్కోరకంగా ప్రవర్తిస్తుంటాయి. కాకి కావ్ కావ్ అంటుంది. కోయిల కూ కూ అంటుంది. మాటలు నేర్చిన చిలక అయితే కొన్ని పదాలు వల్లెవేస్తుంది. కానీ ఈ లైర్ పక్షి మాత్రం 30 రకాల శబ్దాలతో వినే వాళ్లను నోరెళ్లబెట్టిస్తోంది. ఈ వీడియోని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు. ఈ వీడియోని ఇప్పటికే 2లక్షల మందికి పైగా చూశారు.