శ్రేయా పాట.. నెటిజన్లు ఫిదా!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

శ్రేయా ఘోషల్‌ది అరుదైన గొంతు. ఆమె ఒక్క పాట పాడినా తమ ఆల్బమ్ సూపర్ హిట్టయినట్టేనని టాప్ సంగీత దర్శకులు సైతం ఫీలవుతూ ఉంటారు. తన గొంతుతో యావత్ భారతవనిని తనవైపు తిప్పుకుంది. హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇతర సౌత్ ఇండియా భాషాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడింది. శ్రేయా తాజాగా  హిందీకి చెందిన ఓ పాత పాట ‘మెయిన్ తెరి నజర్‌కా సరూర్ హున్’ ను పాడి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాట విన్న నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా విపరీతంగా కామెంట్స్ పెడుతూ.. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.