(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మూగ జీవాల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఎంత మొత్తుకున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మారుమూల గ్రామంలోకి ప్రవేశించిన పాము.. ప్లాస్టిక్ బాటిల్ ను మింగేసి తీవ్ర అవస్థలు పడింది. ఇది గమనించిన స్థానికులు స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పాము మింగిన బాటిల్‌ను బయటకు తీసేలా ప్రయత్నించారు. ఆ తర్వాత పాము తన కడుపులో ఉన్న బాటిల్‌ను బయటకు కక్కేసింది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. “ప్లాస్టిక్‌ను మనం ఎక్కడ అంటే అక్కడ పడేస్తున్నాం. ఒక్క చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా అటవీ జంతువులకు, ఇతర జాతులకు ఎంత ప్రమాదం కలిగిస్తాయో చూడండి” అని ప్రవీణ్ ట్వీట్ చేశారు.
When it comes to #plastic there is nothing called as throwing away. See how single use plastic like bottles effecting the wildlife & other species. Video may disturb you. pic.twitter.com/swnxAjbyCx
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 10, 2020