న్యూస్ ఆర్బిట్ డెస్క్
ఈస్టర్ పండగ రోజు 300 మందికి పైగా అమాయకుల ప్రాణాలు బలిగొన్న శ్రీలంక బాంబు దాడుల్లో నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్ దగ్గర ఎక్కువ మంది మృతి చెందారు. రాజధాని కొలంబోకి నెగోంబో 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అక్కడ బాంబు పేలుడుకు నిముషాల ముందు సిసిటివి ఫుటేజిని ఒక శ్రీలంక న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. అందులో ఆత్మాహుతికి పాల్పడిన టెరరిస్టు వీపుకు ఓ బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని సెయింట్ సెబాస్టియన్ చర్చ్ లోకి నింపాదిగా నడుచుకుంటూ రావడం కనబడుతుంది. దారిలో ఒక పాప ఎదురయినపుడు అతను ఒక్క క్షణం ఆగి ఆమె తలపై చేతితో తట్టి నడక సాగిస్తాడు. చర్చ్‌లో ఆ వ్యక్తి ప్రవేశించిన తర్వాత పేలుడుకు ముందు సిసిటివి ఫుటేజి ఆగిపోయింది.
ఆ పాప తాత దిలీప్ ఫెర్నాండో తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఆ వ్యక్తిని తాను గమనించాననీ, అతనిలో ఎలాంటి ఆందోళనగానీ, భయం గానీ కనబడలేదనీ చెప్పారు. సెయింట్ సెబాస్టియన్ చర్చ్ పేలుడులో 27 మంది పిల్లలు మృతి చెందినట్లు యునిసెఫ్ ధృవీకరించింది.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి: