(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికా అమ్మాయికీ భారతీయ సంతతి కుర్రాడికీ వివాహం. పెళ్లి అమెరికాలో. ఆ పెళ్లి విందులో అమెరికా అమ్మాయి హిందీ సినిమా పాటకు స్టెప్స్ వేసింది. అది కూడా అదిరిపోయేట్లు. ఇంతకీ ఆ అమెరికా అమ్మాయి ఎవరో కాదు, మొన్న వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చిన టెన్నిస్ స్టార్ యాలిసన్ రిస్క్. అబ్బాయి ఒకప్పటి మన టెన్నిస్ స్టార్ ఆనంద్ అమృతరాజ్ కుమారుడు స్టీఫెన్ అమృతరాజ్.
officially an Amritraj! I’m the luckiest lady because of @stephenamritraj ! where all my new Indian followers at??!! here’s a little Bollywood to try to win over your affection! ??? pic.twitter.com/ejX29aT5cF
— Alison Riske-Amritraj???? (@Riske4rewards) July 21, 2019
పెళ్లి వేడుకలో బార్ బార్ దేఖో సినిమా పాటకు యాలిసన్ చక్కగా డాన్స్ చేసింది. ఈ వీడియో ట్విట్టర్లో చూసి ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా అభినందనలు తెలియజేసింది.