NewsOrbit
Right Side Videos

హాట్సాఫ్ పాపా!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దివ్యాంగురాలైన ఓ బాలిక వీడియో బిజినెస్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాను కదిలించింది. దానిని ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆ చిన్ని పాప నామావశిష్టమైన చేతులతో పుట్టింది. ఓ పండు ముక్కను ఫోర్క్‌తో తీసుకుని తినేందుకు ఆ పాప కాలి వేళ్లను ఉపయోగిస్తుంది. ఇది చూసి తనకు కన్నీరు ఆగలేదని మహీంద్రా ట్వీట్ చేశారు.

పండు ముక్కను నోటికి అందించేందుకు ఆ పాప తెలివిని ఉపయోగించడం  వీడియోలో కనబడుతుంది. దానిని ఉద్దేశించి మహీంద్రా, జీవితంలో ఎన్ని లోపాలు సవాళ్లు ఉన్నప్పటికీ ఇది ఒక వరం. దానిని ఎంత చక్కగా గడుపుతామన్నది మన చేతిలో ఉంది అని పేర్కొన్నారు. ఇలాంటివి చూసినపుడు నాలోని ఆశావాదం ఇనుమడిస్తుంది ఆని ఆయన ట్వీట్ చేశారు.

ఈ వీడియో 2016 నాటిది. రష్యాకు చెందిన వాసిలీనా అనే ఈ పాప తల్లి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అప్పట్లో దీనికి అయిదు కోట్ల వ్యూస్ వచ్చాయి.

 

వాసలీనాను కన్నతల్లి రష్యాలోని ఎకాటెరిన్‌బర్గ్ నగరంలోని ఒక అనాధాశ్రమంలో వదిలేసింది. అక్కడ ఆ పాప 12 నెలల పసికందుగా ఉన్నపుడు పెంపుడు తల్లిదండ్రులు దత్తత తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియోకు వచ్చిన స్పందన చూసి వారు వాసలీనా స్ఫూర్తిని వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో పాప దినచర్యలను రికార్డు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాసలీనా జాయ్ ఛానల్ అనే పేరుతో ఆ పాప వీడియోలతో ఒక యుట్యూబ్ ఛానల్ నడుస్తోంది. ప్రకృతి సృష్టించిన అవరోధాలను వాసలీనా ఎంత పట్టుదలగా, ఎంత సరదాగా అధిగమిస్తుందో అందులో చూడవచ్చు.

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment