పైకి దూకుతున్న జలపాతం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

నీరు పల్లమెరుగు అన్నది జగమెరిగిన సత్యం. సర్వకాల సర్వావస్థలలోనూ నీళ్లు ముందుకే ప్రవహిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. దీనికి భిన్నంగా ఆ జలపాతంలో నీళ్లు కిందికి దూకకుండా పైకి వెళుతున్నాయి. ఐర్లాండ్‌లోని ఈ జలపాతం దృశ్యం వీడియో వైరల్ అవుతోంది.

ఐర్లాండ్‌లోని క్లిఫ్స్ ఆఫ్ మదర్ పర్వతాలపైకి సాహసయాత్రకు వెళ్లిన ఓ స్నేహితుల బృందం గురుత్వాకర్షణను నీళ్లు ధిక్కరిస్తున్న ఈ దృశ్యాన్ని  వీడియో తీసింది. ఐర్లాండ్ తూర్పు తీరంలో గాలులు ఎంత బలంగా వీస్తాయంటే కొన్నిసార్లు నీరు పైకి కూడా వెళతాయి. ఈ వీడియోలో కనబడుతున్నది కూడా అదే.