(న్యూస్ ఆర్బిట్ డెస్క్ )
పదేళ్ల క్రితం రిలీజ్ అయి దుమ్ము లేపిన జస్టిన్ బీబర్ పాట బేబీ చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆరోజుల్లో ఆ పాట బీబర్ ఫీవర్ సృష్టించింది. ఇన్నేళ్ల తర్వాత బేబీ సాంగ్‌ను మరోసారి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. ఒక రైతు నోట వినవచ్చిన ఆ పాట ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
కర్నాటకలో ఒక రైతు పాడిన బేబీ పాట వీడియో వైరల్ అయింది. ఆ పాటను ఎక్కడ షూట్ చేసిందీ ఖచ్చితంగా తెలియదు. పొలంలో పని చేసుకుంటున్న రైతు దగ్గరకు ఎవరో వెళ్లి పాట పాడాలని కోరతాడు. కాస్సేపు సంభాషణ తర్వాత ఆ రైతు సెల్లో పాట పెట్టి తనూ గొంతు కలుపుతాడు. దీనికి సోషల్ మీడియా వేదికలపై మంచి స్పందన వచ్చింది.