ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ.. సీనియర్ విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. సీనియర్ వైద్య విద్యార్థులు రెచ్చిపోయారు. సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీలో సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వర్సిటీలో కొత్తగా చేరిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో అత్యంత దారుణంగా వ్యవహరించారు. గుండ్లు కొట్టించుకుని తమకు సెల్యూట్ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. తెల్లటి వస్త్రాలు ధరించాలని, కళాశాలకు వచ్చేటప్పుడు ఒకే లైన్లో రావాలన్నారు. దీంతో సుమారు 150 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గుండ్లు కొట్టించుకుని సీనియర్లకు సెల్యూట్ చేశారు. దీనిని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో యూనివర్సిటీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో డీన్ రాజ్ కుమార్ స్పందించారు. యూనివర్సిటీ పరిసరాల్లో ర్యాగింగ్‌కు చోటే లేదని, విద్యార్థులపై నిఘా ఉంచామని తెలిపారు. ఈ ఘటనకు కారమైన కొందరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశామన్నారు.
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…