బాలివుడ్ పాటకు అమెరికన్ మహిళల నృత్యం

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఆదివారం జరుపుకుంటుంటే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఒక రోజు ముందుగానే వేడుకలు ప్రారంభమయ్యాయి. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అమెరికన్ మహిళలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలివుడ్ చిత్రం ‘సత్యమేవ జయతే’లోని దిల్‌బర్ పాటకు అనుగుణంగా అమెరికన్ మహిళా బృందం వేసిన స్టెప్పులు అబ్బురపరిచారు. ఉత్సవాలకు సంబంధించిన ఈ వీడియోను వారు ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది.