బైక్ నడిపిన కుక్క!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఓ శునకం బైక్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కుక్క బైక్ డ్రైవ్ చేస్తుంటే… దాని వెనక ఇద్దరు కూర్చున్నారు. ఎలాంటి భయమూ లేకుండా ఆ కుక్క… చక్కగా డ్రైవింగ్ చేసింది. ఈ ఘటన బ్రెజిల్ లో జరిగినట్టు తెలుస్తోంది. నేషనల్ హైవేపై, దాని యజమాని, మరొకరు వెనుక కూర్చుని ఉండగా, ఈ శునకం దర్జాగా బైక్ హ్యాండిల్స్ పట్టుకుని, ముందు కూర్చుని బైక్ ను నడుపుతోంది. ఈ వీడియోని ఓ యువతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఈ వీడియోను వేల మంది చూశారు. వందల మంది కామెంట్లు చేశారు. కుక్కకు హెల్మెట్ ఎక్కడుందని కొందరు, ఈ తరహా పిచ్చి పనులు చేయవద్దని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆ కుక్క బాగానే తోలుతోంది కానీ… హెల్మెట్ పెట్టుకోవాలి అని ఓ నెటిజన్ అన్నాడు. ఆ కుక్కకు డ్రైవింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ ఇచ్చారా అని మరో నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు.

https://twitter.com/apocalypticola/status/1188507096423137281