NewsOrbit
Right Side Videos

రాములమ్మ మాస్టర్​ కిక్ చూశారా ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఒకప్పుడు లేడీ అమితాబ్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న విజయశాంతి..దాదాపు 13 ఏళ్లు గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా సందర్భంగా విజయశాంతి చేసిన ఒక ఫీట్‌ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న రాములమ్మ.. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రొఫెసర్  భారతీ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియోను మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 13 సంవత్సరం తర్వాత అద్భుతమైన పునరాగమనం. విజయశాంతి మేడమ్ మాస్టర్ కిక్ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్  చేశారు.

ఆ వీడియోలో నటుడు బ్రహ్మాజీని విజయశాంతి కాలితో కిక్ ఇస్తున్నారు. స్లో మోషన్‌లో తీసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూస్తే..అప్పట్లో ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్ గుర్తుకువస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో విజయశాంతి అభిమానులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. సినిమాలకు ఇన్నాళ్లు గడిచినా ఆమెలో అదే గ్రేస్, అదే మాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ యాక్టింగ్, డ్యాన్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.వంద కోట్ల క్లబ్‌లోకి చేరిందీ చిత్రం.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment