(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పిల్లిని చూస్తే ఎలక ఏమి చేస్తుందో అందరికీ తెలుసు. తన ప్రాణం రక్షించుకునేందుకు పరుగు తీస్తుంది ఎలుక. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనకు ఆహారం దొరికింది కదా అని ఎలుక మీదకు పిల్లి వెళ్లగా అది పారిపోకుండా యుద్ధానికి సిద్ధపడింది. ఎలుకే పిల్లి మీదకు రావడంతో అది ఖంగుతిని పరుగు లంఘించుకొన్నది. అయినా ఎలుక ఆగకుండా పిల్లిని ఆమడ దూరం వరకూ తరుముకుంటూ వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Who says Tom abd Jerry is NOT based on real life!
? pic.twitter.com/GWLyM1rPuu— Harpreet (@CestMoiz) June 20, 2019