NewsOrbit
Right Side Videos

ప్రాణాలకు తెగించి..!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కొకైన్‌తో  నిండిన సబ్‌మెరైన్ దూసుకుపోతోంది. అమెరికా కోస్ట్ గార్డ్ జవానులు రెండు బోట్లలో వెంటపడ్డారు. బోటు ఆపండి అంటూ వెంటాడారు. చివరికి జలాంతర్గామి దగ్గరకు వచ్చిన తర్వాత ముగ్గురు జవాన్లు దానిపై దూకారు. జలాంతర్గామి హాచ్‌ (లోపలకు దిగే దారిపై మూత)పై ఒక జవాను బలంగా మోదాడు. చివరికి తలుపు తెరుచుకుంది. ఒక స్మగ్లర్ చేతులు ఎత్తి బయటకువచ్చాడు. దానితో వీడియో ఆగిపోయింది.

ఇదేదో సినిమా అనకుంటున్నారా. కాదు పసిఫిక్ మహా సముద్రంలో జూన్ 18న జరిగిన యదార్ధ సంఘటన. ఈ సెమీ సబ్‌మెర్సిబుల్‌లో అమెరికా కోస్ట్‌గార్డ్‌కు  17 వేల పౌండ్లకు పైగా కొకైన్ దొరికింది. దీని విలువ 23 కోట్ల 20 లక్షల డాలర్ల వరకూ ఉంటుంది. అంటే సుమారుగా 1624 కోట్ల రూపాయలు.

అమెరికాకు దొంగ రవాణా అయ్యే డ్రగ్స్‌లో దాదాపు 80 శాతం పసిఫిక్ ద్వారా వస్తుంది. దీనికి సెమీ సబ్‌మెర్సిబుల్ వాడతారు. ఇవి జలాంతర్గాములే కానీ వాటిలాగా పూర్తిగా లోపలకు వెళ్లలేవు. పసిఫిక్ మహాసముద్రంలో వీటి జాడ కనిపెట్టడం చాల కష్టం. సంవత్సరానికి ఒకటి దొరికినా గొప్పే.

కనబడిన దానిని పట్టుకోవడం కూడా అంత తేలిక కాదు. కోస్ట్‌గార్డ్ వెంటపడినపుడు స్మగ్లర్లు ఆయుధాలు ఉపయోగిస్తారు. దాని లోపల దిగిన  జవాన్ల ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్లే లెక్క. డ్రగ్స్ దొరకకుండా ఉండేందుకు స్మగ్లర్లు జలాంతర్గామిని ముంచివేసే ప్రమాదం కూడా ఉంది. జూన్ 18 న దొరికిన  సబ్‌మెర్సిబుల్‌లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కోస్ట్‌గార్డ్   దానిని ముంచివేశారు.

Video Courtesy: NBC News

వాషింగ్టన్ పోస్ట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment