File Photo
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాల్ మెక్‌కల్లీ మొన్న 11వ తేదీన ఆస్ట్రేలియా, మిర్టిల్‌ఫోర్డ్ పట్టణంలో కారు నడుపుకుంటూ వెళుతున్నాడు. యధాలాపంగా అద్దంలోంచి పైకి చూసేసరికి ఓ అద్భుత దృశ్యం అతని కంట పడింది. వెంటనే కారు పక్కకి తీసి ఆకాశంలో తనకు కనబడిన ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు.
ఇంతకీ మెక్‌కల్లీకి ఆకాశంలో కనబడిన ఆ అద్భుత దృశ్యం ఏమిటో తెలుసా? మేఘాలు. ఇదేంటి ఆకాశంలో మేఘాలు ఎప్పుడూ కనబడేవే కదా అనుకుంటున్నారా? మెక్‌కల్లీకి కనబడిన మేఘాలు సాధారణ మేఘాలు కావు. వాటి పేరు ఎంత విచిత్రంగా ఉంటుందో అవి కనబడడం అంత అరుదుగా ఉంటుంది.
మెక్‌కల్లికి కనబడిన మేఘాలను అండ్యులేటస్ యాస్పరేటస్ మేఘాలు అంటారు. ఇవి సముద్రంలో తరంగాల వలే తేలిపోతూ కనబడతాయి. వీటిని మేఘాలుగా గుర్తించడానికి కూడా చాలా కాలం పట్టింది. క్లౌడ్ అప్రీసియేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు గ్రావిన్ పెటోర్ పినీ ఎనిమిదేళ్ల పాటు కృషి చేసిన తర్వాత ఈ మేఘాలకు 2017లో మేఘాల హోదా ఇచ్చారు.
మెక్‌కల్లీకి కనబడిన మేఘాలను మీరూ చూడండి ఇక్కడ:
వాషింగ్టన్ పోస్టు సౌజన్యంతో
Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…