(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విమానం ఎక్కేందుకు మొదటిసారి విమానాశ్రయానికి వెళ్లినవారు కాస్త అయోమయానికి గురవడం సహజమే. అయితే ఈమె మరీ ఎక్కువ అయోమయం పాలయింది. విమానం ఎక్కేందుకు వెళ్లే దారి అనుకుని లగేజీ మోసుకువెళ్లే కన్వేయర్ బెల్టుపైకి ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Just when I think I’ve seen all the various symptoms of ‘Airport Brain’ some passengers seem to suffer from when flying…this was at New Istanbul Airport…pic.twitter.com/dzwDiOj4yf
— Alex Macheras (@AlexInAir) July 12, 2019
టర్కీ రాజధాని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళ చెక్ఇన్ కౌంటర్లో తన బ్యాగులు అప్పగించిన తర్వాత టెర్మినల్ వైపు నడిచే బదులు నేరుగా వెళ్లి తాను కూడా కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కింది. కదిలే బెల్ట్‌పై బాలెన్స్ ఆపుకోలేక కింద పడింది. మహిళ కన్వేయర్ బెల్ట్ వేపు నడుస్తుంటే అర్ధం కాక చూస్తున్న సిబ్బంది ఆమె కింద పడగానే బెల్ట్ కదలిక ఆపి ఆమెకు సహాయంగా వెళ్లారు.
సిసిటివిలో రికార్డయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై రకరకాల కామెంట్లు వచ్చాయి.