(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జంతు ప్రదర్శన శాలల్లో క్రూరమృగాల చెంతకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ల గురించి, గాయపడిన వాళ్ల గురించి మనకు తెలిసిందే. తాజాగా ఓ మహిళ సింహం ఎన్‌క్లోజర్‌లోకి అక్రమం చొరబడటమే కాకుండా.. దాని ముందు డ్యాన్స్ చేసింది. అయితే, సింహం జాలి వల్ల ఆమెకు పెను ప్రమాదం తప్పిపోయింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న బ్రాంక్స్ జూలో శనివారం జరిగిందీ తతంగం.
Shocking video from inside the Bronx Zoo shows woman who climbed into lion exhibit.
There was a moat between the woman and lion, but the zoo says this was “a serious violation and unlawful trespass that could have resulted in serious injury or death.” https://t.co/sMXQHszTgc pic.twitter.com/Mh6555Gywf
— ABC News (@ABC) October 2, 2019
ఓ మహిళ అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘించి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లింది. ఓ మృగరాజు ముందు నిల్చుని తిక్కతిక్క చేష్టలు చేసింది. అంతేకాదు సదరు మహిళ డ్యాన్స్ కళ కూడా ప్రదర్శించింది. ఆ సింహానికి ఇలాంటివి కొత్తేమో, లేకపోతే ఆకలి మూడ్‌లో లేదో, ఆమె వెర్రిదని దానికీ తెలిసిందేమోగాని పంజా విసరకుండా ఆ మహిళ విన్యాసాలను మౌనంగా చూస్తుండి పోయింది. ఇంతలో జూ సిబ్బంది అటుగా వచ్చి ఆమెను సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రియల్ సోబ్రినో అనే వ్యక్తి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగానే క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నేను చూసేసరికే ఆమె ఆఫ్రికా సింహం ఎన్‌క్లోజర్‌లో ఉంది. ఆమె కాసేపు సింహాన్ని చూస్తూ కదలకుండా నిలుచుని ఉంది. సింహం కూడా ఆమెను చూస్తే అలాగే ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆమె దాని ముందు డ్యాన్స్ చేసి ఆటపట్టించే ప్రయత్నం చేసింది. దీంతో సింహం ఆగ్రహంతో గాండ్రించింది. అది ఆమెపై దాడి చేస్తుందనే భయంతో నేను నా పిల్లలతో అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు’’ అని తెలిపాడు.
https://www.instagram.com/p/B2-wZ4gBf5t/?utm_source=ig_embed
మరోవైపు ఈ వీడియో చూసిన జూ నిర్వాహకులు.. సందర్శకులు జంతువుల ఎన్క్లోజర్లలోకి ప్రవేశించడం నేరమని, ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమె సింహం నుంచి సురక్షితంగా బయటపడి ఉండవచ్చని, ఇప్పటివరకు సింహం దాడిచేసిన సమాచారం ఏదీ లేదన్నారు.