(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మాల్‌కు వచ్చినవారంతా ఎవరి హడావుడిలో వారు ఉన్నారు. అకస్మాత్తుగా కారు వేగంగా వచ్చిన చప్పుడు, సడన్ బ్రేక్ వేస్తే టైర్లు కీచుమన్న చప్పుడు, అద్దాలు ముక్కలైన చప్పుడు. అంతే జనం ఎవరికి వారు చెల్లాచెదురయ్యారు. షికాగో శివార్లలోని షాంబర్గ్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే విండ్‌ఫీల్డ్ మాల్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన.
ఓ 22 ఏళ్ల కుర్రవాడు నల్లటి సువ్ కారును నడుపుకుంటూ మాల్లో ప్రవేశించి స్వైరవిహారం చేశాడు. చివరికి మాల్ మధ్యలో ఆగాడు. ఆ సమయంలో అక్కడున్న డ్యూటీలో లేని పోలీసులు ఇద్దరు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనను టెరరిస్టు చర్యగా భావించడం లేదని షాంబర్గ్ పోలీస్ చీఫ్ బిల్ ఊల్ఫ్ పేర్కొన్నారు. దీనిలో ఎవరూ గాయపడలేదు.