ఫుడ్ పెడితే ఈ పిల్లోడు ఏం అంటాడో తెలుసా?

Share

చిన్న‌పిల్ల‌ల చేష్టల‌ను చూస్తే.. ఎంత ముద్దొస్తుంది క‌దా..? వారి బుడిబుడి అడుగుల‌ను, చిన్ని చిన్ని మాటల‌ను వింటుంటే మ‌న‌సు పుల‌క‌రిస్తుంది కదా..? అలాంటి పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు మంచి చెడ్డ‌ల‌ను నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు అవే సంస్క‌రం మాట‌లు చిన్న పిల్ల‌లు మాట్లాడితే ఎంతో బాగుంటుంది క‌దా.. అలాంటి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో అల‌రిస్తోంది. దీన్ని చూసిన నెటిజ‌న్లు బుడ్డోడు భ‌‌లే మాట్లాడుతున్నాడు అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

అప్పుడే ఇంత గొప్ప సంస్కారం అలవర్చుకున్న ఈ బుడ్డోడు నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. వాళ్ల‌మ్మ నుంచి ఏ వ‌స్తువు, ఏ తినుబండారం తీసుకున్నా.. ఆ బుడ్డోడు వెంట‌నే ముద్దుముద్దుగా థ్యాంక్యూ మామా అని అంటూ అంద‌రి ప్ర‌సంస‌లు పొందుతున్నాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియోను ఒక‌త‌ను త‌న‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దాంతో చూస్తుండ‌గానే ప‌లువురి నుంచి ప్ర‌సంస‌లు పొందింది. గ్రే అనే బుడ్డోడు తన తల్లికి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పే తీరు అందరికి తెగ న‌చ్చుతోంది. అందుకే ఈ వీడియోను పెద్ద సంఖ్యలో నెటిజ‌న్లు చూస్తున్నారు. ఈ బుడ్డోడికి ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఇంత మ‌ర్యాద ఇచ్చే గుణం ఎలా వ‌చ్చింది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ గుణం అలవడటం చాలా గొప్ప విషయమంటూ అందరూ అభినందిస్తున్నారు. మ‌రెందు ఆల‌స్యం ఇలాగే మీ పిల్ల‌ల‌కు కూడా ఈ చిన్న చిన్న మాట‌ల‌ను అల‌వాటు చేసేయండి. గొప్ప సంస్క‌రం ఉన్న పిల్ల‌లా పెంచండి.


Share

Related posts

Radhe Shyam Team: కరోనా సమయంలో మంచి మనసును  చాటుకున్న రాధే శ్యామ్ టీమ్..!!

bharani jella

ఆచార్యలో ఆ ఒక్క సెట్ కోసమే 4 కోట్లు ఖర్చు చేశారట..!

siddhu

Bigg boss Rohini : ఇంట్లో ఎవరూ లేకపోతే రోహిణి ఏం చేస్తుందో తెలుసా?

Varun G