కాలిఫోర్నియాకు చెందిన స్కేల్డ్ కాంపోజిట్స్ సంస్థ దీన్ని రూపొందించింది. ట్విన్-ఫ్యూసెలేజ్ తరహాలోని ఈ విమానంలో ారు 747 జెట్ ఇంజన్లుంటాయి. రాకెట్లను బాగా ఎత్తువరకు తీసుకెళ్లి, వాటిని అక్కడినుంచే అంతరిక్షంలోకి ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. సంప్రదాయ రాకెట్ లాంచర్లకు ప్రత్యామ్నాయమైన ఈ బాహుబలి విమానం ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది.
విమానం పొడవు 72.5 మీటర్లు, తోక ఎత్తు 15.2 మీటర్లు. దీని ఆపరేషనల్ రేంజి 3,700 కిలోమీటర్లు. దీన్ని నడిపించాలంటే 3,800 మీటర్ల పొడవైన రన్ వే అవసరం. గరిష్ఠంగా 590 టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలదు.
ఈ విమానంలో ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్లను తీసుకెళ్లచ్చు. భూమికి దాదాపు 10వేల మీటర్ల ఎత్తు వరకు విమానం ఎగురుతుంది. ఆ తర్వాత అక్కడినుంచి రాకెట్ ప్రయోగించి, అక్కడి నుంచి తిరిగి వస్తుంది. రాకెట్లను భూమ్మీద నుంచి నేరుగా ప్రయోగించడం కంటే ఇలా ప్రయోగిస్తే ఇంధనం చాలా ఆదా అవుతుంది. కాలిఫోర్నియాలోని స్పేస్ పోర్టు నుంచి, మోజేవ్ ఎయిర్ నుంచి ఈ విమానం టాక్సీ టెస్టులు పూర్తిచేసుకుంది. మరో మూడు టెస్టులు కూడా విజయవంతం అయితే ఈ వేసవిలోనే స్ట్రాటోలాంచ్ భారీ విమానాలను బరిలోకి దించుతుంది.
Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…