రోడ్డు జర్నీ.. తెలియని అనుభూతులను అందిస్తుంది. ఆ అనుభూతులను చిరకాలం గుర్తుండేలా చేస్తుంది. అలాంటి మరుపురాని మదురానుభూతులను అందించే జర్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..? అందుకే లాంగ్ రోడ్డు జర్నీ ఇష్టమైన వారితో వెళ్లాలనుకుంటారు చాలా మంది. కానీ అలా వెళ్లాలంటే ముందు ఒక ప్లాన్ ఉండాలి.. సొంత కారు ఉండాలి. అప్పుడే సాఫీగా జర్నీ నడుస్తుంది. ఆ కారు కూడా ఒక స్టార్ హోటల్ లా ఉంటే.. అప్పుడు ఆ జర్నీ ఎలాగుంటుంది..? ఏంటీ అర్థం కాలేదా.. అయితే ఈ న్యూస్ చదవండి.
వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేటప్పుడు తినడానికి, పడుకోవడానికి కావాల్సిన వస్తువులను వెంట తీసుకెళ్తూ ఎక్కడ పడితే అక్కడ బస చేయాల్పి వస్తుంది కదా ? కానీ ఒకతను తన ఆలోచనతో ట్రిప్ లను ఆస్వధించే వారిని ఇట్టే కట్టేస్తున్నాడు. ఆయనే నాథనిల్ వైస్.
ఈయన ఎక్కువగా రోడ్డు జర్నీని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. దాంతో 2018 నుంచి తన ఎస్యూవీ కారులోనే తన జర్నీని ప్రారంభించాడు. ఆయన తన కారును మార్చుకున్న విధానం, డిజైనింగ్ చూస్తేమాత్రం ముక్కున వేలేసుకోక మానరు. ఎస్యూవీ కారును స్టార్ హోటల్ గదిలాగా మార్చాడు. ఈ కారులో ఉన్న అన్ని సౌకర్యాలను చూపిస్తూ నాథనిల్ ఒక వీడియో తీసి ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.
కారు వెనుక భాగంలో ఉన్న డోరు ఓపెన్ చేయగానే బెడ్ కనబడటంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. తర్వాత కారులో ఉన్న ఒక్కో విషయాన్ని చెబుతుంటే మతి పోతుంది.అందులో స్టవ్, కిచెన్ ఐటమ్స్, చిన్న ఫ్రిడ్జి, బట్టలు, సోలార్ ప్యానెళ్లు ఒక్కటేమిటి సకల సౌకర్యాలను నిలయంగా అది కనిపిస్తుంది. కారును ఇలా కూడా వాడుకోవచ్చా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోను అక్టోబర్ 23న తన ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేశారు. ఇప్పటివరకు దానికి 30వేల వ్యూస్, 4300 లైక్స్ సంపాధించి ట్రెండింగ్ లో నిలిచింది. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్.. ఇది కదా లైఫ్ అంటే.. మీ ఐడియా సూపర్.. అంటూ నెటిజర్లు ఆయనను ప్రసంశిస్తున్నారు.