సర్కారు వారి పాట మే 12వ తారీకు రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 150 కోట్ల మార్కు అందుకునే దిశగా దూసుకుపోతోంది. ఒకపక్క సినిమా రిలీజ్ అయిన నాటి నుండి నెగిటివ్ ప్రచారం .. ఓ హీరో అభిమానులు పనిగట్టుకుని చేయడం మరో పక్క కొన్ని మీడియా ఛానెల్స్ కూడా నెగిటివ్ ప్రచారం చేయటం తెలిసిందే. అయితే ఈ నెగిటివ్ ప్రచారం పై తాజాగా సూపర్ స్టార్ కృష్ణ రియాక్ట్ అయ్యారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సర్కారు వారి పాట విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దూకుడు, పోకిరి కంటే "సర్కారు వారి పాట" చాలా బాగుంది అని పేర్కొన్నారు. కొన్ని మీడియా ఛానల్స్ నెగిటివ్ ప్రచారం చేసినా గాని జనాల్లో డివైడ్ టాక్ లేదని కృష్ణ పేర్కొన్నారు. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ మహేష్ పెర్ఫార్మెన్స్ తో సర్కారు వారి పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది అని కృష్ణ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.