జూలై 26– ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

మేషం

ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో  వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఇంటా బయట కొంత  గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు.  దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

వృషభం

మిధునం ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి

కర్కాటకం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

సింహం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంతవరకు బయట పడతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కీలక వ్యవహారాల్లో చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ధనస్సు భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

మకరం నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కుంభం వృత్తి వ్యాపారాలలో ఇతరలతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.సంతాన విద్యా విషయాల పై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

మీనం ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి..