అక్టోబర్ 12 – ఆశ్వీయుజమాసం – బుదవారం

Check Your Today's Horoscope- October 12 Rasi Phalalu Astrology Today

నేటి జాతక వెబ్ స్టోరీ: సోమరాజు శర్మ రచించారు మరియు దీపక్ రాజుల రూపొందించారు

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు  పెరుగుతాయి వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఆర్థిక  ఇబ్బందులు తొలగుతాయి.

మేషం

వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా  పడతాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత  మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ  అవరోధాలు కలుగుతాయి.

వృషభం

ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.  వ్యాపారమున లాభాలు పెరుగుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.  నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు  చోటుచేసుకుంటాయి.

మిధునం

వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. సన్నిహితుల నుండి విలువైన  సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో  సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది.

కర్కాటకం

సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.  ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది.  వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం  పొందుతారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. భూ సంభంధిత  వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున  పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

కన్య

ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు  చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు  అనుకూలిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని  రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి.

తుల

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు  అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి నూతన భూ గృహ  యోగమున్నది.

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత  పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది.  వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను  కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

ధనస్సు

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు  ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ఉద్యోగాలలో రావలసి  అవకాశాలు చేజారుతాయి కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి.

మకరం

సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో  మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా  గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు  విలువైన వస్తు లాభలు పొందుతారు.

కుంభం

కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు  మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.  ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.  చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

మీనం