అక్టోబర్ 28 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

Check Your Today's Horoscope- October 28 2022 Rasi Phalalu Astrology Today

నేటి జాతక వెబ్ స్టోరీ: సోమరాజు శర్మ రచించారు మరియు దీపక్ రాజుల రూపొందించారు

ఆర్ధిక పురోగతి సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంభందిత వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

మేషం

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనులందు ఆటంకములు తప్పవు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. బంధు మిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. భాగసౌమ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలంగా లేదు.

వృషభం

మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

కర్కాటకం ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంతాన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

సింహం వృత్తి వ్యాపారాలలొ ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. స్థిరస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలొ ఒడిదుడుకులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు..

కన్య విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు.

తుల ఉద్యోగ పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో 

వృశ్చికం విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దూరపు బంధువుల నుండి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.

ధనస్సు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తప్పవు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చెయ్యని పనికి ఇతరుల నుండి నిందలు పడవలసి వస్తుంది. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

కుంభం ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతులు అందుకుంటారు. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఆప్తుల నుండి శుభ వార్తలు అందుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

తెలుగు మరియు జ్యోతిషశాస్త్రంలో రోజువారీ జాతకంపై మరిన్ని వెబ్ కథనాలు