Liger : తెలుగు సినిమా చీకటి కోణం. పూరి Vs ఎక్సిబిటర్స్: లైగర్ నేర్పిన పాఠం?

Images Credit: Instagram/thedevarakonda

తెలుగు సినిమా రంగం చాలా పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనం జూదం ఆడితే, పేకాట ఆడితే తప్పు. ఎందుకంటే..? డబ్బులు పెడ్డి ఆడతాము.. ! పోతాయి.. ! వస్తాయి.. ! పల్లెల్లో జాతరల సమయంలో లాటరీలు పెడుతుంటారు. 

లాటరీ లు ఆడటం కూడా తప్పే. వీటిని జూద క్రీడలు అంటారు. మరి సినిమా అనేది జూదం కాదా..?  సినిమా అనేది పూర్తిగా వ్యాపారం (బిజినెస్). అది వ్యాపారమే కానీ జూదం లాంటి వ్యాపారమే అని అనాల్సి వస్తుంది. ఉదాహారణకు.. ‘లైగర్’ సినిమా.

ఆ సినిమా ప్లాప్, ఆ సినిమా కు పెట్టిన పెట్టుబడి, ఆ సినిమాకు వచ్చిన  నష్టాలు ఇప్పుడు పూజి జగన్నాధ్ కు ఎక్సిబిటర్ లకు, ఫైనాన్షియర్స్ కు  జరుగుతున్న వివాదం మనం చూస్తుంటే కచ్చితంగా సినీ రంగం ఒక జూదమే అని  పేర్కొనవచ్చు.

రీసెంట్ గా పూరి జగన్నాధ్ కు సంబందించి ఆడియో ఒకటి బయటకు విడుదల అయ్యింది. ఇది చాలా మంది విన్నారు. దాని కంటే ముందు సినిమా ఎక్సిబిటర్ లు ఫైనాన్షియర్ల ఆడియో మెసేజ్ వచ్చింది. అది ఏమిటంటే.

“పూరి జగన్నాధ్ ఆఫీసు ముందు మనం అందరం ధర్నా చేయాలి. అందరూ రావాలి. ఎవరెవరైతే రారో వాళ్లను అసోసియేషన్ నుండి బయట పెడతాము, వాళ్లకు మేము తీసే సినిమాలు ఇవ్వము” అంటూ మెసేజ్ పెట్టారు.

 ‘లైగర్’ సినిమా ఫ్లాప్ కారణంగా పూరి జగన్నాధ్, ఫైనాన్షియర్లకు, బయ్యర్ లకు, ఎక్సిబిటర్లకు మధ్య వార్ జరుగుతోంది. అసలు ఈ వివాదం ఏమిటి. కారణం ఏమిటి.. ? పరిష్కారం ఏమిటి ..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..

డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల మెసేజ్ లకు పూరి జగన్నాధ్ రియాక్ట్ అవుతూ విడుదల చేసిన ఆడియోలో ఇది “పూర్తిగా చట్టవిరుద్దం, ధర్నా చేయడానికి ఎవరికీ అనుమతి ఉండదు. నేను వాళ్లకు ఇస్తాను అని చెప్పారు.

సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇంత బలవంతంగా రుద్ది నష్టపోయిన డబ్బులను నన్ను అడుగుతున్నారు. కానీ పోకిరి నుండి ఇస్మార్ట్ శంకర్ వరకూ ఎన్నో సినిమాల్లో లాభాలు వచ్చాయి. ఆ లాభాల నుండి నాకు ఏమైనా తీసుకువచ్చి ఇచ్చారా..?

నా దగ్గర సినిమా కొన్న డబ్బులు కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఈ మధ్యవర్తులు  ఎవరైనా వాళ్ల నుండి వసూలు చేసి నాకు ఇవ్వగలరా. ? సో.. ఇప్పుటికీ నేను  ఇస్తాను అన్నాను. కాకపోతే కొంత టైమ్ కావాలి.

వీటికి కారణాలు ఏమిటంటే..?  సినిమా బడ్జెట్ స్థాయికి మించి పెట్టేయడం. సినిమా స్థాయిని అమాంతం పెంచి వేయడం.

నేను ఇచ్చినప్పుడు తీసుకోండి అన్నట్లు చెప్పి ఎవరైతే ధర్నా చేయడానికి  వస్తాను అన్నారో వారి పేర్ల లిస్ట్ రాసుకుని వాళ్లకు తప్ప మిగిలిన వాళ్లకు  ఇస్తాను” అని కౌంటర్ గా చెప్పారు. చాలా పౌరుషంగా, సీరియస్ గా వార్నింగ్  ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఇది కఛ్చితంగా సినిమాకు ఒక పాఠం.

వీటికి కారణాలు ఏమిటంటే..?  సినిమా బడ్జెట్ స్థాయికి మించి పెట్టేయడం. సినిమా స్థాయిని అమాంతం పెంచి వేయడం.