Devatha Serial Today's Episode: నిజం తెలుసుకున్న ఆదిత్య మాధవ్ ను ఏం చేశాడంటే.!?

నిన్నటితో 606 ఎపిసోడ్స్ లో పూర్తిచేసుకుంది.. ఈ సీరియల్ తాజాగా విడుదలైన  స్టార్ మా సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.86 రేటింగ్ ను  సొంతం చేసుకుని నాలుగవ స్థానంలో నిలబడింది

Devatha Serial Episode 606:

ఆదిత్య దేవిని పలకరిస్తాడు.. కాస్త దూరం వెళ్ళాక వెనక్కు వచ్చి.. నువ్వు  ఒకరిని పోలీసులకు పట్టించాలి.. మా అమ్మను మస్తు కష్టపెట్టేటోడు.. పాపం మా  అమ్మ సచ్చిపోదం అనుకుంటే ఈ నాయనా కపడంటా.. మీ నాన్న అలాంటి వాడిని నీకు  ఎవరు చెప్పారు అమ్మ అని ఆదిత్య బాధపడుతూ అడుగుతాడు.. ఇప్పుడున్న ఈ నాయనే  చెప్పాడు.. మాధవ్ అని తెలిసి కోపంతో ఆదిత్య రగిలిపోతాడు.. చాటుగా ఈ మాటలు  విన్న భాగ్యమ్మ కూడా కోపంతో ఊగిపోతోంది..

భాగ్యమ్మ రాధ దగ్గరకు వచ్చి దేవి పటేల్ దగ్గర ఏం ఏం మాట్లాడిందో నీకు  ఎరికేనా? వాళ్ళ నాయనా మంచోడు కాదని.. తాగుబోతుని అమ్మను ఎప్పుడూ  కొట్టేటోడని అటువంటి కసాయి వాడిని పోలీస్ స్టేషన్ లో ఏపించాలని.. దేవి  పటేల్ కి చెప్తుంటే నా రక్తం మరిగిపోతుంది.. నాకే ఇట్లా ఉంటే కడుపున బిడ్డ  కన్న తండ్రిని అన్ని మాటలు అంటుంటే.. ఆయనకి ఇంకా ఎంత బాధ ఉంటది అని  భాగ్యమ్మ రాధ తో చెబుతుంది..

రాధ ఆదిత్య కు దగ్గరకు వెళ్తుంది.. నేను దేవిని నీకు దగ్గర చేద్దాం  అనుకున్నా కానీ మాధవ్ సార్ ఇట్లా చేశాడు.. నాన్న అని పిలుస్తూ నా దగ్గరకు  వస్తుందని.. నేను ఎదురుచూస్తుంటే.. దేవి ఏమో మా నాన్న కసాయి వాడని  చెబుతుంటే నాకు ఎలా ఉందో తెలుసా.. అసలు ఇదంతా చేసిన ఆ మాధవ్ ను నేను  వదిలిపెట్టను అని ఆదిత్య కోపంగా బయలుదేరతాడు..

దేవత సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఎంతంటే.!?

నిన్నటితో 606 ఎపిసోడ్స్ లో పూర్తిచేసుకుంది.. ఈ సీరియల్ తాజాగా విడుదలైన  స్టార్ మా సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.86 రేటింగ్ ను  సొంతం చేసుకుని నాలుగవ స్థానంలో నిలబడింది.. గత కొద్ది వారాలుగా దేవతా  సీరియల్ మూడు నాలుగు స్థానాల మధ్య ఊగిసలాడుతుంది1

ఈ సీరియల్ ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!