దేవత సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 692: దేవిని కొట్టబోయిన రాధ, నిజం చెప్పేయమన్న చిన్మయి

Devatha Serial Today's Episode Images Courtesy: Disney+Hotstar

Devatha Serial Today's Written Episode November 1 2022 Author: Bharani Jella

రుక్మిణి ఆదిత్య కు ఫోన్ చేస్తుంది.. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని ఆదిత్యను అడుగుతుంది.. నువ్వు అప్పుడు నన్ను అడిగిన ప్రశ్న నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది.. దేవి ఇన్ని రోజుల నుంచి నిన్ను నాన్న ఎదురుగానే ఉన్నా కూడా ఎందుకు చూపించలేదు అని అడిగితే.

ఏం సమాధానం చెబుతావు అని ఆదిత్య అడుగుతాడు.. దేవి నిన్ను చూస్తే చాలు పెనిమిటి.. తను మనసులో ఉన్న బాధనంతా మర్చిపోతుంది.. ఆ ప్రశ్న అడగద్దు అని రుక్మిణి అంటుంది.. ఎప్పుడు చూసినా దేవిని పంపిస్తాను అని అంటున్నావే కానీ .

నువ్వు రావా రుక్మిణి అని ఆదిత్య అడుగుతాడు.. సమాధానం చెప్పలేకపోతున్నావా అని ఆదిత్య అడుగుతాడు.. రుక్మిణి ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది..

దేవి స్కూల్ నుంచి రాగానే.. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి స్కూల్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుకుంటూ కొట్టుకున్నారు.. నువ్వు మా నాన్న ఎవరో నాకు చెప్పకుండా మంచి పని చేసావ్ అమ్మ.

అలా ఎటువంటి గలీజ్ అతన్ని నాకు చూపించుకోకుండా మంచి పని చేశావు.. లేదంటే స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను కూడా ఇలాగే తప్పుగా మాట్లాడేవారు.. నేను బాధపడకూడదని నువ్వు మా నాన్న ఎవరో నాకు చెప్పలేదు కదా అని దేవి అంటుంది.

ఆ మాటలకు కోపం వచ్చినా రాధ దేవమ్మ అంటూ చెయ్యి ఎత్తుతుంది.. మీ నాన్న గురించి నువ్వు తేలిక తప్పుగా మాట్లాడుతున్నావు.

ఇంకొక్కసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను దేవమ్మ.. నీకు ఆయన గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నావు అంటూ రాధ కోపంగా దేవి పై అరుస్తూ చెయ్యి ఎత్తుతుంది..

కాసేపటి తర్వాత నీకు తెలియని వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పి చెయ్యి దించేస్తుంది.. అక్కడ నుంచి రాధా కోపంగా పక్కకు వెళ్ళిపోయింది

అమ్మ చెల్లి అడిగింది కరెక్టే కదా.. నువ్వు ఎందుకు ఆఫీసర్ సారే దేవి వాళ్ళ నాన్న అని ఎందుకు చెప్పడం లేదు అని చిన్మయి దగ్గరకు వచ్చి అడుగుతుంది.

నువ్వు చెప్పిన మాట దేవికి చెప్పడం చాలా సులువే.‌ కానీ దేవి ఆ విషయాన్ని అంతటితో వదిలేయలేదు దేవి.. నన్ను కూడా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దాం పదమని అంటుంది.. అయితే నువ్వు కూడా ఆఫీసర్ అంకుల్ తో కలిసి దేవిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చిన్మయి అంటుంది..