Devatha Serial Today's Episode: ఆదిత్యను నిలదీసిన సత్య.. అదిత్యకు కరాటే దేవి షాక్..! భాగ్యమ్మ మకాం రాధ ఇంట్లో..!

August 2 - Latest Episode

రాధతో భాగ్యమ్మ దేవుడమ్మ తల్లి ఇళ్ళెత్తుకుంటూ నా కాడికి వచ్చింది.. నువ్వు నా దగ్గరికి వచ్చావేమోనని అనుమానం వచ్చి అడిగింది. దేవుడమ్మ బాధ వింటే నాకు మస్తు బాధ అయింది అని భాగ్యమ్మ చెబుతుంది..

Devatha Serial Episode 606:

నువ్వు గాని నా గురించి నిజం చెప్పేస్తే నేను ఇంకోసారి మీకు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను అని రాధ భాగ్యమును బెదిరిస్తుంది.. సరే చెప్పను అని భాగ్యమ్మ అంటుంది.. ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది..

ఆ మాధవ్ సారు నా బిడ్డ మనసుల విషయం నుంచి పెనిమిటికీ నా బిడ్డను ఇంకా దూరం చేయాలని చూస్తున్నాడు అని అంటుంది.. నేను నీతో పాటే మీ ఇంట్లోనే ఉంటా పని మనిషిగా ఉంటాను అని భాగ్యమ్మ అంటుంది..

ఆదిత్య దేవుని కలవడానికి కరాటే స్కూల్ దగ్గరకు వెళ్తాడు నేను కరాటే నేర్చుకుంటున్నాను ఆఫీసర్ అని చెబుతుంది. ఈ కరాటే బాగా నేర్చుకుని.. మీరు మా నాన్నను చూపించేసరికి బాగా నేర్చుకుంటాను అని అంటుంది..

అప్పుడు మా నాన్నను నేనే బాగా కొడతాను అని దేవి అంటుంది.. నా మాటలు విని ఆదిత్య బాధపడతాడు. దేవి మనసులో ఇంత విషయాన్ని నింపిన మాధవుని తలుచుకొని ఆదిత్య బాధపడతాడు..

ఇక అదే బాధతో ఇంటికి వచ్చి మౌనంగా కూర్చుని ఉంటాడు.. ఏంటి ఆదిత్య ఇప్పుడేనా ఆఫీస్ నుంచి వస్తున్నావు అని సత్య ఆఫీస్ ఫైల్స్ ను పట్టుకొని ఎదురుగా వస్తుంది.. నువ్వు ఆఫీసుకు కూడా వెళ్లడం లేదని..

నాకు పొద్దున మీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు చెబితే కానీ అర్థం కాలేదు.. నీ మనసులో ఏం బాధ ఉందో నాకు చెప్పొచ్చు కదా ఆదిత్య అని సత్య అడుగుతుంది.. నువ్వు దేవి గురించి ఆలోచిస్తున్నావని..

దేవి దగ్గరికి వెళ్తున్నామని నాకు అర్థమైంది.. నువ్వు ఎంతగా దేవి గురించి ఆలోచించినా తను మన బిడ్డ కాదు కదా.. మాధవ్ బిడ్డే కదా అని అంటుంది.. సత్య నీకు నా పనులు ఇప్పుడు అర్థం కావు . అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది అని ఆదిత్య మనసులో అనుకుంటాడు..