దేవత సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అక్టోబర్ 27: దేవిని తనతో పాటే తన ఇంటికి తీసుకెళ్తానన్న ఆదిత్య.

Devatha Serial Today's Episode Images Courtesy: Disney+Hotstar

Devatha Serial Today's Written Episode October 27 Author: Bharani Jella

చిన్మయి రాధకు ఫోన్ చేసి దేవి ఎక్కడ ఉందో కనిపించిందా అని అడుగుతుంది.. లేదమ్మా చిన్మయి ఇంకా కనిపించలేదు.. ఆఫీసర్ అంకుల్ నేను వెతుకుతున్నాము అని రాధా చెబుతుంది. 

మాధవ్ కి దేవి కనిపించిది చిన్మయి చెబుతుంది. అవునా దేవి ఎక్కడుంది అని చిన్మయి ని అడుగుతాడు మాధవ్.. ఆ విషయాన్ని మాత్రం చిన్మయి చాలా సీక్రెట్ గా చెబుతుంది

దేవి ఎక్కడ ఉందో తెలుసుకున్న మాధవ్ అది కచ్చితంగా మన ఏరియానేగా.. అయితే మనోళ్లు చూసుకుంటారులే అని అన్నట్టుగా మాధవ్ మనసులో అనుకుంటాడు..

రుక్మిణి ఇంట్లో భాగ్యమ్మ  చూసిన సత్య షాక్ అవుతూ.. అమ్మా అని పిలుస్తుంది.. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నాకు నీకు మొత్తం తెలుసు.. నాకు మొత్తం అర్దం అయింది అని సత్య అంటుంది.. నీకు అంతా తెలిసినా కూడా నువ్వు ఎందుకు నా దగ్గర ఈ విషయం రాయాలని అనుకున్నావా అమ్మ.

ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు తెలిసినా కూడా నువ్వు అక్కకే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నావు ఈ కూతురు ఏమైపోయినా నీకు పర్వాలేదా నీ కూతురు నీకు అంత కానిది అయ్యిందా అని సత్య అడుగుతుంది.. ఎన్ని రోజుల నుంచి నీకు ఇదంతా తెలిసినా కూడా నా దగ్గర తెలియనట్టు ఎలా ఉంటున్నావ్ అమ్మ .

ఆ మటలకు భాగ్యమ్మ రుక్కవ్వ నీకంటే ఎక్కువ కష్టాల్లో ఉంది అని భాగ్యమ్మ అంది.. నా జీవితంలో సంతోషం లేదు అని సత్య అంటుంది.. నువ్వు సత్య గా అర్థం చేసుకోకు సత్యవ్వ అని భాగ్యమ్మ అంటుంది.. ఆ కూతురు బాగుండాలి అని ఈ కూతురు ను వదిలేసావా.

అక్క నీకు ఎలా అర్థం అవుతుందో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఇప్పుడు నచ్చడం లేదు.. అప్పుడు త్యాగం చేసింది అనుకున్నా.. నాకు త్యాగం చేయక పోయినా ఫర్వాలేదు.. కానీ అన్యాయం చేయద్దని చెప్పమ్మా.

ఆఫీసర్ రూమ్ ఇలాగైనా ఉండేది ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయని దేవుడమ్మ.. ఆదిత్య రూమ్ లో అన్ని వస్తువులను నీటుగా సర్దుతుంది. అంతలో ఆదిత్య పుస్తకంలో ఒక ఫోటో కనిపిస్తుంది అది ఏంటని ఓపెన్ చేసి చూస్తే రుక్మిణి ఫోటో.. రుక్మిణి ఫోటోని చూసిన దేవుడమ్మ.. షాక్ అవుతుంది ఆదిత్య పుస్తకాలలో రుక్మిణి ఫోటో ఉంది అంటే ఏంటి అర్థం.. 

తను ఇంకా రుక్మిణి ఇష్టపడుతున్నాడా లేదంటే ఆదిత్య కు రుక్మిణి కనిపించిందా .. ఈ మధ్య అందరికీ రుక్మిణి కనిపిస్తుంది అని అంటున్నారు.. అలా అయితే ఆదిత్య కు కూడా రుక్మిణి కనిపించిందా.. అందుకేనా ఆదిత్యలో ఈ మార్పు వచ్చింది అని దేవుడమ్మ ఆలోచిస్తూ ఉంటుంది.