ఇక పై మహిళా క్రికెటర్ల కూ పురుషులతో సమానం గా మ్యాచ్ ఫీజులు : బీసీసీఐ

BCCI Women's Cricket India

Visual Story Written by Mahesh Duba and Created by Deepak Rajula

లింగ అసమానతలను తొలగించే దిశగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తో మహిళా క్రికెట్ ప్రపంచం లో నూతన అధ్యాయం మొదలైన రోజు.

క్రికెట్ అంటే పురుషులు మాత్రమే అనే మూస ధోరణి కి చరమ గీతం పాడుతూ, తామూ పురుషులతో సమానం గా రాణిస్తున్న క్రమంలో బీసీసీఐ నిర్ణయం

ఈ నెల 27 వ తారీఖు న జరిగిన 15 వ బీసీసీఐ సర్వ సభ్య సమావేశం లో బోర్డు సభ్యులు ఏకగ్రీవం గా ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.

ఈ సందర్భం లో బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా మాట్లాడుతూ, " మహిళా క్రికెటర్ల కు సమాన మ్యాచ్ ఫీజులను చెల్లించటం బీసీసీఐ బాధ్యత అని, వారి కోసం మద్దతు పలికిన సర్వ సభ్య కమిటీ కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు" చెప్పారు.

లింగ వివక్ష ను రూపు మాపటం లో బీసీసీఐ తొలి అడుగు వేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు, లింగ సమానత్వం విషయం లో కొత్త యుగం మొదలయినట్లు" జై షా పేర్కొన్నారు .

ఇప్పటి నుండి బీసీసీఐ తో ఒప్పందం కుదుర్చుకున్న మహిళా క్రికెటర్లకు, పురుషులతో సమానంగా టెస్ట్ మ్యాచ్ కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నారు

ఇదివరకు వన్డే, టీ20 లకు రూ. 1 లక్ష , టెస్ట్ మ్యాచ్ లకు రూ. 4 లక్షలు మాత్రమే చెల్లించేవారు. అయితే కేంద్ర కాంట్రాక్టులలో   బీసీసీఐ ఇంకా ఎటువంటి మార్పులూ చేయలేదు.