Anna Mani 104th Birthday: ఆడవాళ్లు ఇంటికే పరిమితం అనే ఆ రోజులలో భారత వాతావరణ శాఖలో అద్భుతాలు సృష్టించిన అన్నా మణి

భారత వాతావరణ సూచన తల్లిగా పేరుందిన అన్నా మణి జయంతి నేడ. ఆమె 104వ జయంతి సందర్భంగా భారత వాతావరణ సూచన తల్లికి గౌరవార్థం గూగుల్‌ డూడుల్‌ రిలీజ్‌ చేసింది గూగుల్‌

అన్నా మణి 12 సంవత్సరాల వయసులోనే పబ్లిక్ గ్రంథాలయంలో అన్ని పుస్తకాలను తిరగసేసింది. తండ్రి ఇంజనీర్ కావటం ఏమో గాని చిన్ననాటి నుండి చదువుపై మంచి ఆసక్తి కనబరిచింది.

జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఖాదీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం  జరిగింది. ఆనాటి రోజులలోనే స్త్రీ శక్తికి ఉదాహరణగా నిలిచి దేశభక్తిని  ప్రదర్శించడం జరిగింది

ఆడపిల్లలు కేవలం వివాహానికి పరిమితమై ఇంటిలోనే ఉండాలనే కట్టుబాటులు కలిగిన రోజులలో తండ్రిని ఒప్పించి ఉన్నత చదువులు అభ్యసించింది.

తన తోటి వాళ్లకి వివాహాలు జరుగుతున్నా గాని అన్నా మణి మాత్రం చదువుకే  ప్రాధాన్యత ఇచ్చి తనకి ఇష్టమైన భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ  సంపాదించడం జరిగింది.

చదువు పూర్తయిన తర్వాత డాక్టరేట్ పట్టా కోసం సార్ సి.వి.రామన్ లేబరేటరీలో  అన్నా మణి జాయిన్ కావడం జరిగింది. అక్కడ కాంతి గురించి ఏకంగా ఐదు రీసెర్చ్  పేపర్లు అందించడం జరిగింది.

మద్రాస్ రెసిడెన్సి కాలేజ్ లో స్త్రీ అనే కారణంగా అన్నా మణి అనేక ఇబ్బందులు  ఎదుర్కోవటం జరిగింది. ఈ క్రమంలో పీహెచ్.డి పట్టా కూడా అందుకోలేకపోయింది.  అయినా గాని అన్నా మణిలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు.

ఈ క్రమంలో ఉన్నత విద్య కోసం ఏకంగా అమెరికాకి ఆ రోజుల్లోనే అన్నా మణి పయనం కావడం జరిగింది. అక్కడ వాతావరణ శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసి..1948లో దేశానికి తిరిగి రావడం జరిగింది.

శాస్త్ర పరిశోధనకు తగిన మౌలిక సదుపాయాలు, స్థిరమైన సంస్థలు లేని ఆ  రోజుల్లోనే పూణేలోని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ లో అన్నా మణి  జాయిన్ అయ్యారు.

దేశంలో విజ్ఞాన రంగం ఇంకా ప్రారంభ దశలో ఉండగానే భారతదేశంలో ఉత్పత్తి  చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. పలు  ప్రాంతాలలో సోలార్ రేడియేషన్ స్థాయిని కొలిచే పరికరాల వర్క్ షాప్ ఏర్పాటు  చేయడం జరిగింది. ఓజోన్ పొర తీరు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పవన  విద్యుత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి  వాతావరణ శాఖలో అనేక అద్భుతాలు సృష్టించారు.

1987లో ఐఎన్‌ఎస్‌ఏ కేఆర్‌ రామనాథన్‌ మెడల్‌తో ఆమెను సత్కరించింది  ప్రభుత్వం. ఇన్ని అద్భుతాలు వాతావరణ శాఖలో సృష్టించటంతో అన్నా మణి భారత  వాతావరణ శాఖకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకోవడం జరిగింది.  మహాత్మా గాంధీని పూర్తిగా తీసుకున్న ఆమె తన జీవితకాలం పాటు ఖాది వస్త్రాలను  ధరించడం జరిగింది. ఎంతసేపు విజ్ఞాన రంగానికి ఏదైనా అందించాలన్న దిశగా  అన్నా మణి ఆలోచనలు చేసేవారు. దీంతో జీవితకాలం చివరివరకు ఆమె వివాహం  చేసుకోలేదు. 2001వ సంవత్సరం ఆగస్టు 16వ తారీకు గుండె సంబంధిత వ్యాధితో ఆమె  మరణించడం జరిగింది.