ఒక్కటయిన రిషి,వసుధార.. సాక్షికి షాక్ ఇచ్చిన దేవయాని..!

గుప్పెడంత మ‌న‌సు

Author: Suma K

గత ఎపిసోడ్ లో రిషి ఒక్కసారిగా సీరియస్ అయ్యి దేవయానికి సాక్షి గురించిన అన్ని నిజాలు చెబుతాడు. సాక్షి. చేసిన పనులు విని ఇంట్లోని వారందరు ఒక్కసారికి. షాక్ అవుతారు.ఇక దేవయాని మాత్రం ఏమి తెలియనట్టు అవునా అన్నట్లు నటిస్తుంది.

ఆ తర్వాత రిషి సాక్షి చాలా తప్పు చేసింది అని గతంలో తను సూసైడ్ కి ప్రయత్నించింది అని తెలిసి తనతో మాట్లాడటానికి ఒప్పుకున్నాను అని,ఇక తనను నాతో జాగ్రత్తగా ఉండమని మీరే చెప్పాలి పెద్దమ్మ అంటూ దేవయానికి చెప్తాడు రిషి.

సాక్షిని డీల్ చేసే బాధ్యతను దేవాయాని తీసుకుంటుందా..?

ఇక మహేంద్ర వర్మ, ఫణేంద్ర వర్మ కూడా దేవయాని చెబితేనే కరెక్ట్ అని రిషికి వంత పాడతారు. దేవయాని సాక్షికి చాలా సపోర్ట్ చేసింది కాబట్టి. దేవాయని చెప్తే కచ్చితంగా తను వింటుంది అని అంటాడు ఫణింద్ర వర్మ

రిషి దగ్గర అడ్డంగా బుక్ అయిన దేవయాని:

ఇంట్లో వాళ్ళ మాటలు విని తను ఇలా బుక్ అయ్యాను ఏంటి అని అనుకుంటుంది దేవయాని. మనసులో.ఇక సాక్షి చాప్టర్ క్లోజ్  అని అనుకుంటుంది. తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళగా జగతి వచ్చి ఇంట్లో స్వీట్ చేసి చాలా రోజులు అయింది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

సీన్ మళ్ళీ వసు దగ్గర ఓపెన్ అవుతుంది. ఏంటి రిషి సార్ కలుస్తాను అన్నాడు అని ఇంకా రాలేదు అని వసు ఎదురుచూస్తుంది.

రిషి చెప్పిన సమాధానంతో షాక్ లో సాక్షి :

కొద్దిసేపు అయ్యాక రిషి అక్కడికి వచ్చి తనను చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంటాడు.సరిగ్గా అప్పుడే సాక్షి రిషి కి ఫోన్ చేస్తుంది.రిషి తను వసుధారతో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

మనం ఇప్పటికే చాలా దూరం వచ్చేశాం కదా వెనక్కు ఎలా వెళతాం సార్ అంటుంది. జీవితం అనే ప్రయాణంలో ఒక్కోచోట మన ప్రయాణం ఆగిపోతుంది. అంతమాత్రాన అక్కడే ఆగిపోలేం కదా కారైనా, మనుషులైనా ఏదో మార్పు ఉంటుంది కదా అంటాడు రిషి.

వేదాంతం వల్లించిన రిషి :

దేవయాని మాటలు విన్న సాక్షి ఒక్కసారిగా అయోమయంలో పడుతుంది.ఇంట్లో వాళ్లు కూడా దేవయాని మాటలకూ షాక్ అవుతారు. మహేంద్ర వర్మ మాత్రం మళ్ళీ వదిన ఎమన్నా రివర్స్ గేమ్ ఆడుతుందా అనే అనుమానం వ్యక్తం చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

సాక్షికి షాక్ ఇచ్చిన దేవయాని: