Guppedantha Manasu Today Episode October 11 : వసును నా నుంచి దూరం చేసి నన్ను మళ్ళీ ఒంటరి చేయకండి అని జగతిని వేడుకున్న రిషి..!!

జగతి కళ్ళు తిరిగి పడిపోవడంతో వసు, రిషి  కంగారుగా ఇంటికి వస్తారు. ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. పాపం.  జగతి ఎంతో బాధగా జీవితం అనే బొమ్మల కొలువలో నేనే ఒక దోషగా మిగిలాను అని  జగతి అంటుంది.వసు మాత్రం జ్యూస్ తీసుకోండి అని అంటుంది. అప్పుడే బయట  నుంచుని ఉన్న రిషిని వసు, మహేంద్ర చూస్తారు. మేడం మీరు జ్యూస్ తాగుతూ  ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రిషి దగ్గరికి వెళ్తుంది వాసు వాసన  చూసిన రిషి ఎలా ఉన్నారు మేడం అంటే అలానే ఉన్నారు.

ఆ మెడిసిన్ బయట నుంచి తెపించేది కాదు  అంటాడు. మరి ఏంటి డాడ్ అని రిషి అంటే మానసిక ప్రశాంతత అని అంటాడు మహేంద్ర  తను టీచర్ గా, భార్యగా అన్ని చోట్ల గెలిచింది. కానీ తల్లిగా మాత్రం  ఓడిపోతుంది అని అంటాడు.తనని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాను..  గెలుస్తుంది కదా రిషి అని మహేంద్ర అంటే అక్కడ నుండి రిషి వెళ్ళిపోతాడు.

ఇక ధరణి వంట చేస్తుంటే వసు వెళ్లి మేడం మీ  కాలు నొప్పి తగ్గిందా అంటే ఎప్పుడో తగ్గిపోయింది అంటుంది. అయినా నువ్వు  అందరి గురించి ఆలోచిస్తావ్ కదా వసు అని ధరణి అంటే అందరి గురించి  ఆలోచిస్తూనే కదా సంతోషం అని వసు అంటుంది. అప్పుడే దేవయాని వచ్చి ధరణిని  జగతికి ఎమన్నా కావాలేమో తెలుసుకో అని అక్కడ నుండి పంపించేస్తుంది. ఇక వసు  కూడా అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే నీతో మాట్లాడాలి ఉండు అని దేవయాని  అంటుంది. మేడం నేను కాస్త బిజీగా ఉన్నాను. తర్వాత మాట్లాడదాము అని వసు  అంటుంది. ఇక దేవయాని కోపంగా నీకు ఈ మధ్య దైర్యం బాగా పెరిగిపోయింది  అంటుంది.

ధైర్యం ఎక్కువ అయితే సంతోషపడాలి కదా మేడం  బాధపడితే ఎలా అని వసు అంటుంది. మాటలు బాగా నేర్చావ్ అని దేవయాని అంటే మాటలు  బాగా మాట్లాడకతే ఈ పాడు లోకంలో బతకలేము మేడం అని అంటుంది వసు.అయినా అంత  జరిగిన తరువాత మళ్ళీ ఈ ఇంటికి ఎలా వచ్చావ్.. నీకు సిగ్గు లేదా వసుదార అని  అంటుంది దేవయాని. అసలు ఏమి జరిగింది మేడం.. ఇంతకన్నా రిషి సార్ తో నాకు  చాలానే గొడవలు ఉన్నాయి.. అయినా మా బంధాన్ని ఎవరు విడదీయలేరు. మా మధ్యలో ఒక  మంచి ఒప్పందం ఉంది అంటే ఏంటి అది అని దేవయాని అంటే అది చెప్పేది కాదులే  మేడం అంటుంది వసు.

ఇక రిషి వసు దగ్గరకు వచ్చి నాకు కొంచెం బయట  చిన్న పని ఉంది నేను వెళ్తున్నాను.నిన్ను గౌతమ్ ఇంటి దగ్గర డ్రాప్  చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇక వసదారని రిషి కారులో ఇంటిదగ్గర  డ్రాప్ చేస్తాడు. రిషి మాత్రం వసూలు నిన్ను పంపించడం ఇష్టం లేకనే ఇలా  బయటికి వచ్చేసాను నిన్ను ఇంటికి తీసుకువచ్చేటప్పుడు నాకు చాలా సంతోషంగా  ఉంటుంది అదే నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించాలంటేనే మనసుకి చాలా కష్టంగా  ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు.

ఇక రాత్రి అయ్యాక వాసు రెండు బొమ్మలని  పట్టుకుని వాటితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రిషి వసూ గురించి ఆలోచిస్తూ ఈ  పొగరు ఏంటి ఫోన్ చేయలేదు అంటుకుంటూ నన్ను ఏమన్నా అడగాలా అని మెసేజ్  చేస్తాడు. ఇక వసు ఆ అవును సర్ రేపు నేను జగతి మేడంని చూడడానికి మీ ఇంటికి  రావచ్చా అని అంటుంది కరిచి మాత్రం నిన్ను ఆపేదెవరు వస్తువు నువ్వు  ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అని అంటాడు

మరుసటి రోజు ఉదయం జగతి గదిలోకి రిషి కాఫీ  తీసుకుని వెళ్తాడు.కళ్ళు మూసుకుని ఉన్న జగతి మహేంద్ర కాఫీ తెచ్చాడేమో  అనుకుని చూస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రిషి ఉండటం తోటి నువ్వా  అని లేవటానికి ప్రయత్నిస్తే పర్లేదు మేడం పడుకోండి అని చెప్పి పక్కనే ఉన్న  మంచినీళ్ల బాటిల్ చేతికి ఇచ్చి తాగండి అంటాడు.మేడం మీ ఆరోగ్యం గురించి డాడ్  ని అడిగాను. మీరు ఆరోగ్యంగా ఉండాలి మేడం అని అంటాడు.మీరు ఇలా అవ్వడానికి  కారణం నేనే అని మీరు అనుకోకండి. నాకు ఇష్టం లేని పని నాతో. చేయించకండి.. ఆ  పిలుపు కోసం మీరు దయచేసి ఆందోళన పడకండి ఆ పిలుపు నాకు చిన్నప్పుడే దూరం  అయింది

నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ పిలుపుతో  పిలుస్తాను అలాగే మీరు నాకు నా కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇవ్వగలరా అని  జగతిని ప్రశ్నిస్తాడు రిషి. అమ్మా అనే పిలుపు నాకు చిన్నప్పుడే దూరం అయింది  మేడం అని రిషి అంటే జగతి మాత్రం నేనే తప్పు చేయలేదు అని చెప్పబోతుంటే ఏమి  చెప్పోదు మేడం అంటాడు.ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి వసుధార వచ్చాక నాకు  జీవితం అంటే ఏంటో తెలిసింది మేడం. దయచేసి మళ్ళీ ఆ బంధాన్ని కూడా నాకు దూరం  చేయకండి మేడం అని అంటాడు.