గుప్పెడంత మనసు ఎపిసోడ్ 594: నా తండ్రిని నాకు దూరం చేసింది మీ మేడం, అంటూ జగతిని తప్పుపట్టిన రిషి.

గుప్పెడంత మనసు ఎపిసోడ్ 583

Guppedantha Manasu Today Episode October 17 Author: Suma K

మేడం నన్ను బాగా మెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాను అట ఇకపై కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు థాంక్స్ చెబుతున్నారు అని వెటకారంగా అంటుంది వసుధార. 

గుప్పెడంత మనసు October 29 ఎపిసోడ్ 594 : వసుకు థాంక్స్ ఎందుకు పెద్దమ్మ అన్న రిషి

ఇక వసు మాత్రం దేవయాని వంక చూస్తూ చూశారా మేడం సార్ ఏమి అన్నారో. మీరు ఏమి మహేంద్ర సార్,జగతి మేడం ఇంట్లో లేరని బాధపడకండి అని దేవాయనికి వెటకారంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది

గుప్పెడంత మనసు October 29 ఎపిసోడ్ 594 : Guppedantha manasu today episode: జగతిని తప్పుపట్టిన రిషి 

ఇక బయట రిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.రిషి సార్ ను గమనించిన వసుమిమ్మల్ని, మేడంతో కలపాలని నేను చాలా పట్టుదలగా ఉన్నాను కానీ ఇప్పుడు రిషిసార్, మహేంద్ర సార్ కి కూడా దూరమయ్యేలాగా ఉన్నారు.

సీన్ కట్ చేస్తే వసు సారీ అని మెసేజ్ పెట్టింది మహేంద్ర అని అంటుంది. మనం ఇల్లు వదిలి వచ్చేసినందుకు సారీ చెప్పి ఉంటుంది అంతేకానీ తన పట్టుదల విషయంలో ఏమాత్రం తగ్గదు అని అంటాడు మహేంద్ర. అది కాదు మహేంద్ర మనం ఇల్లు వదిలి వచ్చి తప్పు చేస్తున్నామేమో

గుప్పెడంత మనసు October 29 ఎపిసోడ్ 594 : కొడుకు కోసం తల్లి ఆవేదన 

రిషి బాధపడుతున్నాడు అని ఇప్పుడు మనం  వెళ్తే మొదలుపెట్టిన పని పూర్తికాకుండానే మధ్యలోనే అయిపోతుంది. అయినా రిషి  కన్నా వెయ్యి రెట్లు బాధ ఎక్కువగా నాకు ఉంది అని మహేంద్ర కొడుకుని  తలుచుకుని ఎమోషనల్ అవుతాడు

మళ్ళీ సీన్ దేవయాని దగ్గర ఓపెన్ అవుతుంది..ఇల్లు క్లీనింగ్ చేస్తున్న ధరణిని పిలిచి కబుర్లు చెప్పుకుందాం రా అని అంటుంది. ధరణి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండగా ఒకసారి నీ ఫోన్ తీసుకురా ధరణి అని అంటుంది దేవయాని.సరే అత్తయ్యగారు అని ధరణి ఫోన్ ఇస్తుంది. 

గుప్పెడంత మనసు October 29 ఎపిసోడ్ 594 : కొడుకు కోసం తండ్రి పడే ఆవేదన

ధరణి ఇచ్చిన కాఫీ తాగుతూన్న దేవయాని ఏంటో ధరణి, ఆలోచిస్తుంటే ఈ లోకం ఏమైపోతుందో… రాను రాను మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది అని అంటుంది. దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నాయి అని అనుకుంటుంది ధరణి మనసులో. 

గుప్పెడంత మనసు October 29 ఎపిసోడ్ 594 : 

అయినా ఈమధ్య నీకు బాగా పొగరు పెరిగింది అని  అంటుంది దేవయాని. సరే నాకు వంటింట్లో పని ఉంది ఏమైనా ఫోన్ వస్తే నాకు  ఇవ్వండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి.