Intinti Gruhalakshmi: తులసి తప్పు చేసిందన్న అనసూయమ్మ, రెచ్చిపోయిన నందు.

Intinti Gruhalakshmi: Serial Today's Episode October 26 2022

తులసి, సామ్రాట్ ఇద్దరు ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి వెళ్తారు.. ఆ ఇంట్లో నుంచి  ఓ ఇద్దరు కుర్రాళ్ళు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతారు.. అర్జెంటుగా మా  ఇంట్లో వాళ్లకి ఫోన్ చేయాలి అని తులసి చెబుతుంది.. సామ్రాట్ వెంటనే  కుదిరితే తనకి ఓ టవల్ ఇవ్వండి.. తను బాగా తడిసిపోయింది అని సామ్రాట్  అంటాడు.

మీరు ఎవరో మాకు తెలియదు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎలా షల్టర్ ఇస్తామని వాళ్ళు ప్రశ్నిస్తారు.. నా పేరు సామ్రాట్ ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయండి.. నేను ఎవరో మీకు తెలుస్తుంది అని సామ్రాట్ అంటాడు.. వాళ్ళు వెంటనే నెట్లో సర్చ్ చేయగానే సామ్రాట్ ఒక బిజినెస్ ఐకాన్ అని తెలుసుకొని ఇంట్లోకి రమ్మని పిలుస్తారు..

తులసి ఆ ఇంట్లోకి వెళ్లేసరికి అందరూ పార్టీ చేసుకునే మూడ్లో ఉంటారు.. గబగబా వాళ్ళ మామయ్యకు ఫోన్ చేసి మేము ఇక్కడ సేఫ్ గానే ఉన్నాము అని చెబుతుంది తులసి.. అయితే ఈ రోజు అక్కడే ఉండండి.. వాన తగ్గే వరకు బయటకు రావద్దు అని ఇంట్లో వాళ్ళందరూ చెబుతారు..

ఇక సామ్రాట్ ని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాతో కలిసి డాన్స్ చేయమని అడుగుతారు. ఇప్పుడు ఇదంతా కుదరదు అని సామ్రాట్ చెబుతుండగా.. అంతకుముందు తులసి సామ్రాట్ ఇద్దరూ కలిసి దాండియా చేసిన వీడియో ఒకటి చూపించి మీరు మాతో ఈరోజు డాన్స్ చేయాల్సిందే అని పట్టుబడతారు.

ఆ పక్క రూమ్లో మా ఇంట్లో వాళ్ళ డ్రెస్సెస్ ఉన్నాయి చేంజ్ చేసుకోమని చెబుతారు ఇక తులసి మొదటిసారి సామ్రాట్ ముందు పంచాయతీ డ్రెస్సులు కనిపిస్తుంది ఇక మన హీరోయిన్ ని ఒక్కసారిగా డ్రెస్ లో చూసేసరికి ఫీజులు ఎగిరిపోతాయి గ్యాస్ అంతా తులసి మీదే ఉంటుంది అది చాలా దాని నట్టు అక్కడున్న ఒక అబ్బాయి తన స్నేహితురాలు అయినా ఒక ఫ్రెండ్ కి లవ్ ప్రపోజ్ చేస్తాడు

తులసి, సామ్రాట్ ఇద్దరు ఆ పార్టీ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.. సామ్రాట్ తులసి ఇద్దరూ అక్కడ ఉన్న వాళ్ళ అందరితో కలిసి డాన్స్ వేస్తారు.. అలా డాన్స్ వేస్తూ వేస్తూ సామ్రాట్ పక్కకు వచ్చి కూర్చుంటాడు అప్పుడే సామ్రాట్ నీరసంగా ఉన్నాడని తులసి అర్థం చేసుకుంటుంది..

అక్కడ ఉన్నవాళ్లు సామ్రాట్ని పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతాడు.. అదే కరెక్ట్ అని తులసి అంటుంది.. మరోపక్క నందు గడియారంలో ముళ్ళు ఒకే దగ్గర కలిసి అలాగే సామ్రాట్ తులసి ఇద్దరూ ఒకే గదిలో కలిసి ఉన్నారు అన్న ఊహే నాకు ఇబ్బందిగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు..

రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ తో మనసులో ఎలాంటి ఉద్దేశం కల్మషం లేని వాళ్ళు అగౌరవంగా ప్రవర్తించరు అని తులసి అంటుంది.. అమ్మ ఫోన్ చేసింది.. ఏ నిమిషంలోనైనా రావచ్చు అని ప్రేమ్ అంటాడు.. 

ప్రయాణం ఎలా జరిగింది ఆంటీ అని శృతి అడుగుతుంది.. ప్రయాణం కాదు ప్రేమాయణం ఎలా జరిగింది అని అడుగు అని నందు అంటాడు.. మిస్టర్ నందగోపాల్ అని తులసి పెద్దగా అంటుంది.. నందు ఏం తప్పు మాట్లాడలేదు .. నీ అవతారమే చెబుతుంది.. నువ్వు ఏదో అవకతవక పని చేసి వచ్చావని అని అనసూయమ్మ అంటుంది..