Intinti Gruhalakshmi Latest Episode:

హనీ ఎలా గెలుస్తుంది..!? తులసి ఎలా పార్టిసిపేట్ చేస్తుంది.!? షాక్ లో నందు..!

నవోదయ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న కాంపిటీషన్లో హనీ డ్రెస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుంది.. కానీ వాళ్ల టీచర్ ఎవరు ఊహించని విధంగా ఆ కాంపిటీషన్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది.. ఈ విషయం తెలుసుకున్న తులసి వెంటనే సామ్రాట్ కు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది.. సామ్రాట్ మొత్తం వెతుకుతాడు కానీ సెక్యూరిటీ గార్డ్ ఆమె ఇప్పుడే వెళ్లిపోయిందని చెబుతాడు..

Intinti Gruhalakshmi July 29th

ఇక మొత్తానికి ఆమె మిస్ అయిందని.. హనీ ఈ కాంపిటీషన్లో ఓడిపోతుందని.. నేను  తన హనీకి నా ఫేస్ ని చూపించలేను బాబాయ్ అని సామ్రాట్ బాధపడుతూ ఉంటాడు..  నువ్వే ఎలాగైనా హానికి ధైర్యం చెప్పాలి పదా అని లోపలికి వెళ్తారు..

తులసి కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్న జడ్జెస్ దగ్గరికి వెళ్లి ఏదో  మాట్లాడుతుంది.. అది చూసిన వాళ్ళ బాబాయ్ మనం చేయవలసిన పని తులసి చేస్తుంది.  బహుశా హనీ ఈ కాంపిటీషన్లో పాల్గొనట్లేదు అని చెప్పిందేమో అని అనుకుంటాడు.  హనీ ని ముందు వెళ్లి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చెయ్యి నీ వెనుకమాల మీ మిస్  ని పంపిస్తాను అని.. తులసి హనీ ని ముందుగా స్టజ్ మీదకు పంపిస్తుంది..

ఇక హనీ డాన్స్ వేస్తుండగా తులసి కూడా స్టేజ్ పైకి వెళ్లి ఇద్దరు కలిసి  పర్ఫామెన్స్ చేస్తారు.. తులసి హనీ పెర్ఫార్మెన్స్ కు అందరూ చప్పట్లు  కొడతారు.. జడ్జెస్ ఇద్దర్నీ ఫైనల్ విన్నర్స్ ని సెలెక్ట్ చేశారు ఆ ఇద్దరినీ  స్టేజ్ మీదకి పిలుస్తున్నాను అని హనీ, లక్కీ పేరు అనౌన్స్ చేస్తారు.. ఈ  ఇద్దరిలో విన్నర్స్ ఎవరు అంటే ఇద్దరు విన్నర్సే అని ప్రకటిస్తారు  కాంపిటీషన్ ఆర్గనైజేషన్..

అలా ఎలా తులసి ఈ స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేస్తుంది.. హనీ వాళ్ళ టీచర్  కాదు కదా.. తులసి ఎలా కాంపిటీషన్లో పాల్గొంటుంది.. హనీ ఎలా విన్నర్  అవుతుంది అని ఆడియన్స్ లో ఒకరు లేచి ప్రశ్నిస్తారు.. వెంటనే తులసి  ముందుగానే మా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుంది అని.. తను హనీకి సంగీతం  టీచర్ అని..

అసలు ప్రోగ్రాంలో పాల్గొనాల్సిన టీచర్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో హనీ  బాధపడకూడదు అని.. ఒక కాంపిటేటర్ కోసం తను పాటిస్పేట్ చేయడం మాకు కరెక్ట్  అనిపించింది.. అందుకే తనకు అవకాశం ఇచ్చాము అని ఈవెంట్ ఆర్గనైజర్స్  చెప్తారు..

నేను గెలవడానికి కారణం అయిన తులసి ఆంటీ కూడా స్టేజి పైన ఉండాలి అని మైక్ లో  అనౌన్స్ చేస్తుంది హనీ.. అందరి ముందు జడ్జెస్ చేతుల మీదుగా హనీ, లక్కీ  ప్రైసెస్ తీసుకుంటారు.. ఇక తరువాయి భాగంలో తులసి మ్యూజిక్స్ స్కూల్ గురించి  మాట్లాడడానికి నందు , లాస్య వాళ్ళ ఇంటికి వెళ్తారు..

వీళ్ళు ఎందుకు వచ్చారు అని అనసూయమ్మ అడుగుతుంది.. మేము తులసి సంగీతం స్కూల్  ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చాము అని  చెబుతాడు.. ఓకే పని వాళ్ళు మీరు అయితే తులసి ఏంటి తులసి గారు అని పిలవండి  అని అంటుంది.. నందు కూడా తులసి గారు అని పిలుస్తాడు..