మీరు అంజలి యొక్క ఝాన్సీ 2022 వెబ్‌సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ ఎందుకు చూడాలి అనేదానికి 10 కారణాలు

Jhansi  2022 Web series Critics Reviews and Analysis: Stroy by Deepak Rajula/NewsOrbit

డిస్నీ హాట్ స్టార్ లో అదరగొడుతున్న అంజలి “ఝాన్సీ” వెబ్ సిరీస్..!

మొదటి సీజన్ 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ కి తిరు దర్శకత్వం వహించారు.

కృష్ణ కులశేఖరన్, మధుబాల నిర్మాతగా రాణించారు.

నటీనటులు: అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, అభిరామ్ వర్మ, రమేష్ వారి తాలూరి తదితరులు.

హీరోయిన్ అంజలి అందరికీ సుపరిచితురాలే. గోదావరి జిల్లాలకు చెందిన ఈ  ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన క్రేజ్ సంపాదించింది.

గతం మర్చిపోయిన అమ్మాయిగా అంజలి.. తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తన గతాన్ని తెలుసుకోవడం కోసం ఝాన్సీగా అంజలి కనిపిస్తుంది.

జలపాతంలో పడిపోయి ప్రవాహంలో కొట్టుకొచ్చిన యువతి (అంజలి) కేరళలో గిరిజనులు కాపాడుతారు. ఆమెకు గాయాలు కట్టి కోలుకునేలా చేస్తారు. ఈ క్రమంలో సంకిత్ (ఆదర్శ్ బాలకృష్ణ) తన ఒక్కగానొక్క కూతురైన “మేహ” తో కలిసి ఆ గిరిజనుల ఉండే అడవిలోకి వెళ్తారు.

అయితే ఆ గిరిజనులు ఆమెకు గతం గుర్తు లేదని చెబుతారు. దీంతో ఎంతో సాహసోపేతంగా తన కూతురిని కాపాడిన అంజలీని తనతో పాటు హైదరాబాదుకి తీసుకొస్తాడు

ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించడం జరిగింది. ప్రతి ఎపిసోడ్ లో అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్కంఠతో వీక్షకులను ఉంచే రీతిలో రూపొందించారు. ఝాన్సీ ప్రయాణంలో కొత్త కొత్త పాత్రలు ఎంటర్ అవుతూ ఉంrడటంతో స్టోరీపై మరింత ఆసక్తి కలిగేలా కథకి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా తీర్చిదిద్దారు. 

యాక్షన్ సీన్స్ లో కూడా శభాష్ అనిపించింది. కచ్చితంగా “ఝాన్సీ”. అంజలి కెరియర్ లో చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్ గా నిలుస్తుందని నిర్మోహమాటంగా చెప్పవచ్చు.