దీప కోసం వంట చేసిన కార్తీక్. అది చూసి కోపంతో రగిలిపోతున్న మోనిత.

కార్తీక దీపం October 19 ఎపిసోడ్ 1487:

Karthika Deepak Images Courtesy of Disney+ Hostar

ఈరోజు అక్టోబర్ 19 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా  తెలుసుకుందాం.ఈరోజు ఎపిసోడ్ లో వారణాసి ఆరోగ్యం గురించి కార్తిక్ అక్కడ  పనిచేస్తున్న డాక్టర్ ను అడుగుతాడు. అలాగే ఆ డాక్టర్ కార్తీక్ ను  గుర్తుపట్టి మీరు హైదరాబాదులో పనిచేసేవారు కదా, మీ ప్రొఫైల్ చూసాను చాలా  బాగుంది అంటాడు

లాంటి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. కొన్ని అనివార్య కారణాలవల్ల కొన్ని నెలలుగా ఇక్కడే ఉండవలసి వచ్చింది అంటాడు ఏమైనా సర్జరీలు ఉంటే చెప్పండి అని కార్తీక్ అంటాడు. సర్జరీలు ఉన్నప్పుడు తప్పనిసరిగా చెప్తాను అని అంటాడు డాక్టర్.

సీన్ కట్ చేస్తే దీప జరిగిన విషయాలు అన్ని డాక్టర్ అన్నయ్యకు చెబుతుంది.కార్తీక్ లో మార్పు మొదలయింది అమ్మా.. నీకు మంచి రోజులు వచ్చాయి అని అంటాడు.

ఇక మోనిత మాత్రం కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు…ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ని, ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అని అంటుంది.అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతుంది. ఎవరో తెలిసిన వాళ్ళులే అని అంటాడు. ఎవరో చెప్తే నాకు తెలుస్తుందేమో కదా అని అంటుంది మోనిత. 

 ముందు సుబ్బారావు అని చెప్పి తరువాత ఆనందరావు, సౌందర్య పేర్లు చెబుతాడు. ఆ పేర్లు విని మోనిత షాక్ అయి కార్తీక్ గతం గుర్తు వచ్చి మాట్లాడుతున్నాడా లేకపోతే మామూలుగానే మాట్లాడుతున్నాడా అని అనుకుంటుంది.సర్లే కార్తీక్ రెండు రోజుల నుంచి టాబ్లెట్ కూడా వేసుకోలేదు వేసుకో అని చెప్పి టీ పెట్టడానికి వెళుతుంది మౌనిత. ఏం టాబ్లెట్ ఇస్తుంది అని వాటిని చూస్తాడు.టీ తెచ్చిన మోనితతో ఆ టాబ్లెట్ ఎందుకు అని అడుగుతాడు.

 గతం గుర్తుకు రావడానికి అని అబద్దం చెబుతుంది మోనిత. గతం గుర్తుకు రావడానికి ఉన్న మతి పోవటానికా? అని మనసులో అనుకుంటాడు.

ఇక దీప,డాక్టర్ అన్నయ్య ఇద్దరు కూడా అస్తవ్యస్తంగా ఉన్న ఇంటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇల్లు ఇలా ఉంటే మా డాక్టర్ బాబుకి నచ్చదు అని అంటుంది దీప. అప్పుడు హేమచంద్ర,నువ్వు ఇక్కడ ఎందుకమ్మా డాక్టర్ బాబుతో ఉండొచ్చు కదా అని అంటే అప్పుడే వచ్చిన కార్తీక్ వద్దులేండి దీప ఈ కుటీరంలో ఉంటేనే బాగుంటుంది అంటాడు.

మీరు డాక్టర్ హేమ చంద్ర కదా అని అంటాడు కార్తీక్.హ అవును మీకు గుర్తు ఉన్నానా అని అంటే ఈ మధ్య కాస్త గుర్తుకు వస్తున్నాయి అంటాడు కార్తీక్.అయినా ఈ ఇంటి గురించే కదా కంగారు,తలా ఒక చెయ్యి వేద్దామని చెప్పి బూజు దులపడం ప్రారంభిస్తాడు కార్తీక్. ఇక మెల్లగా హేమ చంద్ర అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు.ఇంతలో దీప పొద్దున్న ఎవరు ఫోన్ చేశారు అని అడగగా కార్తీక్ వారణాసి గురించి చెప్పకుండా ఏదో అబద్ధం చెప్పేస్తాడు.

సరే డాక్టర్ బాబు నేను వంట చేస్తాను అన్న దీపతో ఎప్పుడు నువ్వే చేస్తావు కదా ఈరోజు నేను చేస్తాను అని అంటాడు కార్తీక్. సరే డాక్టర్ బాబు వంటకు కావలిసినవి అన్ని ఏర్పాటు చేస్తాను అంటుంది దీప.

సీన్ కట్ చేస్తే ఇంటికి శివ లేట్ గా వస్తాడు. శివను గమనించిన మోనిత ఎక్కడికి వెళ్లావు ఈ మధ్య ఎక్కడికో వెళ్తున్నావు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఏం లేదు అని శివ అబద్దం చెప్తాడు.సరే నీ ఉద్యోగం పీకేస్తాను అని మోనిత బ్లాక్మెయిల్ చేస్తుంది...