2022లో టాప్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

ఈ సైట్ లో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి అన్ని వార్తలతో పాటు క్రైమ్ ఇంకా టెక్నికల్ తోపాటు పొలిటికల్ వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మికం మరియు లైఫ్ స్టైల్.. జోక్స్ కి సంబంధించిన వార్తలు కూడా తెలుగు సమయం వెబ్ సైట్ లో లభిస్తాయి.

తెలుగు సమయం:-

మిర్చి నైన్ వెబ్ సైట్ లో లేటెస్ట్ సినిమా వార్తలతో పాటు ఓటిటి కార్యక్రమాలు ఇంకా సినిమా గాసిప్ లకి సంబంధించిన న్యూస్ అందుబాటులో ఉంటాయి. ఇంకా సినిమాల రివ్యూ తో పాటు రాజకీయ వార్తలు కూడా సైట్ లో ఉంటాయి.

మిర్చి 9:-

ఇక తుపాకీ వెబ్ సైట్ తెలుగు మీడియాలోని అతిపెద్ద వెబ్ సైట్. ఈ సైట్ లో మూవీ గాసిప్, సినిమా రివ్యూలు ఇంకా డైలీ మూవీ అప్డేట్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ వార్తలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వార్తలు తుపాకీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తుంటారు.

తుపాకీ:-

తెలుగు స్టాప్ వెబ్ సైట్ లో సినిమా వార్తలతో పాటు రాజకీయ వార్తలు ఇంకా అంతర్జాతీయ వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్ సైట్ కూడా అత్యంత ఆదరణ కలిగింది.

తెలుగు స్టాప్ డాట్ కం

తెలుగు 360 వెబ్ సైట్ లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలతో పాటు సినిమా రంగానికి చెందిన వార్తలు ఇంకా కొత్త సినిమాల రివ్యూలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్ సైట్ లో అన్నీ కూడా డీటెయిల్ గా కంటెంట్ అందిస్తూ ఉంటారు.

తెలుగు 360:-

న్యూస్ ఆర్బిట్ వెబ్ సైట్ అతి తక్కువ టైంలోనే తెలుగు వెబ్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకున్న సైట్. ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ న్యూస్ తో పాటు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు అందుబాటు కలిగిన సైట్. లోతైన రాజకీయ విశ్లేషణలు, ఇంకా సినిమా రివ్యూ లతోపాటు ఓటిటి, తెలుగు టెలివిజన్ టాప్ మోస్ట్ సీరియల్స్ వార్తలు, ఫోటోలు, హెల్త్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంచే వెబ్ సైట్.

న్యూస్ ఆర్బిట్

ఫిల్మీ బిట్

ఫిల్మీ బిట్ వెబ్ సైట్ లో సినిమా వార్తలతో పాటు నటీనటులకు సంబంధించిన వ్యక్తిగత వార్తలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభంలో ఈ సైట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ కొన్నాళ్లకు దాదాపు ఏడు భాషలలో హిందీ, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ మరి కొన్ని భాషలలో అందుబాటులో ఉండడం జరిగింది.

123 తెలుగు

తెలుగు టెలివిజన్ రంగంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ గ్రూప్స్ కి చెందినది 124 తెలుగు డాట్ కం. ఈ వెబ్ సైట్ నందు తెలుగు మూవీ వార్తలతో పాటు కొత్త సినిమాల రివ్యూలు మరియు ఫోటోలు అదేవిధంగా రాజకీయ వార్తలు లభ్యమవుతాయి. కేవలం తెలుగు భాషకి చెందిన వాళ్లను ఉద్దేశించి ఈ సైట్ పెట్టడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ వార్తలకే ఈ వెబ్ సైట్ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.

తెలుగు ఆహా

ఈ వెబ్ సైట్ లో తెలుగు సినిమా వార్తలతోపాటు బాక్సాఫీస్ కలెక్షన్.. ఇంకా ఓటిటి వార్తలు అందుబాటులో ఉంటాయి. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు కూడా పబ్లిష్ చేస్తుంటారు

గుల్టే

గుల్టే అత్యంత క్వాలిటీ కంటెంట్ కలిగిన సైట్. దీనిలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు ఇంకా విశ్లేషణలు మరియు తెలుగు సినిమాల వార్తలు, రివ్యూలు అందుబాటులో ఉంటాయి. అత్యధికంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గాసిప్ వార్తలు ఈ సైట్ లో ప్రచారం చేస్తుంటారు.

తెలుగు హంగామా

ఇక తెలుగు హంగామా లో ఎక్కువగా సినిమాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. పొలిటికల్ వార్తలు అందుబాటులో ఉన్నా గాని ఎక్కువ ప్రాధాన్యత ఎంటర్టైన్మెంట్ కే అందించే సైట్. దీనిలో తెలుగు సాంగ్ లిరిక్స్.. ఇంకా రాబోయే సినిమాలకు సంబంధించిన వార్తలు కొత్త సినిమా రివ్యూలు కూడా పబ్లిష్ చేస్తారు.

తెలుగు బులిటెన్

తెలుగు వెబ్ మీడియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సైట్. తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని సినిమా వార్తలు పలు కార్యక్రమాల వార్తలు అందుబాటులో ఉంటాయి. ఫిలిం కంటెంట్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు కూడా పబ్లిష్ చేస్తుంటారు.

ఈ టాప్ మోస్ట్ తెలుగు వెబ్ సైట్ లు ఈ ఏడాదిలో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారంతోపాటు సినిమా రివ్యూలు అందించడంలో ముందున్నాయి. అంతేకాదు భారీ ఫాలోవర్స్ కలిగిన తెలుగు వెబ్ మీడియాలో దూసుకుపోతున్నాయి.