Jagadhatri Deepthi Manne: దీప్తి మన్నే గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Author: Saranya K, 06-02-2024 , Newsorbit

రాధమ్మ కూతురు సినిమాతో మంచి ఫేమస్ అయిన అక్షర అలియాస్ దీప్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ రాధమ్మ కూతురు అనే సీరియల్ ఈమెకి ఎక్కువగా పాపులారిటీ ఇచ్చింది.

Jagadhatri Serial Actress Deepthi Manne

 ఇక ఈమె 1991 అక్టోబర్ 25న జన్మించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి 31 సంవత్సరాలు. ఇక ఈమె కర్ణాటకలో జన్మించినప్పటికీ ఇండియాలో స్థిరపడింది. 

ఈమె ఫాదర్ నేమ్ గంగాధర్ రావు. ఈయనవో బిజినెస్ మాన్. ఇక ఈమె తల్లి పేరు లక్ష్మి మన్నే హౌస్ వైఫ్. ఇక దీప్తి తన ఇంట్లో చిన్నమ్మాయి. ఈమెకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. పెద్దక్క పేరు స్ఫూర్తి అలానే చిన్నక్క పేరు నాగిని. 

అదేవిధంగా ఒక బ్రదర్ సైతం ఉన్నాడు. ఆయన పేరు యశ్వి రావు. ఈ ముద్దుగుమ్మ కర్ణాటకలో ఇంటర్ కంప్లీట్ చేసింది. ఇక ఈమె క్వాలిఫికేషన్ బి ఎస్ సి ఫ్యాషన్ డిజైనింగ్. 

ఇక ఈమె కి కాలేజ్ చదువుతున్నప్పుడే మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీ వైపుకి అడుగులు వేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ కి మొదట్లో తమిళ్లో ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. అనంతరం కన్నడలో ఒక సినిమా చేసింది. 

Jagadhatri Serial Actress Deepthi Manne

ఇక ఆ తరువాత ఓ సీరియల్లో ఛాన్స్ రావడంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఈమె వెనక్కి తిరిగి చూడలేదు. ఇక జీ తెలుగులో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్తో మంచి ఫేమస్ అయ్యింది దీప్తి. 

ఇక ఈ ముద్దుగుమ్మ కి రెండు కార్లు ఉన్నాయి. ఈమె హౌస్ విషయానికి వస్తే బెంగళూరులో తన పేరెంట్స్ తో ఉంటుంది. కానీ హైదరాబాద్లో షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మణికొండలో ఓ ఫ్లాట్ ని తీసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. 

Jagadhatri Serial Actress Deepthi Manne

ఇక ప్రస్తుతం సీరియల్లో మంచి పేరు రావడంతో సీరియల్స్ కి పరిమితమైంది దీప్తి. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఈమె మోడలింగ్ రంగంలో కొనసాగించేటట్లు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈమె లైఫ్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.